యాప్నగరం

నా కొడుకు సెంచరీ కొడతాడని ఊహించలేదు

టెస్టు కెరీర్ ఆరంభంలోనే హార్దిక్ పాండ్య శతకం కొడతాడని తామూ ఊహించలేదని అతని తండ్రి హిమాన్షు

TNN 15 Aug 2017, 5:11 pm
టెస్టు కెరీర్ ఆరంభంలోనే హార్దిక్ పాండ్య శతకం కొడతాడని తామూ ఊహించలేదని అతని తండ్రి హిమాన్షు ఆనందం వ్యక్తం చేశారు. ఇటీవల పల్లెకలెలో ముగిసిన చివరి టెస్టులో హార్దిక్ పాండ్య టీ20 తరహా హిట్టింగ్‌తో శతకం బాదేసిన విషయం తెలిసిందే. కెరీర్‌లో ఇప్పటి వరకు 29 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన హార్దిక్ దాదాపు ఆరు సార్లు 50పైచిలుకు స్కోరు చేశాడు.. కానీ శతకానికి మాత్రం చేరువకాలేకపోయాడని హిమాన్షు గుర్తుచేసుకున్నారు. శ్రీలంకతో టెస్టు సిరీస్‌తో టెస్టుల్లోకి అరంగేట్రం చేసిన హార్దిక్ గాలెలో జరిగిన తొలి టెస్టులో అర్ధశతకం కొట్టి.. మూడో టెస్టులో సెంచరీ చేసిన విషయం తెలిసిందే.
Samayam Telugu we didnt expect a t20 like knock from hardik pandya
నా కొడుకు సెంచరీ కొడతాడని ఊహించలేదు


‘కెరీర్ ఆరంభంలోనే హార్దిక్ సెంచరీని మేము ఊహించలేదు. కానీ.. అతని ఆట రోజు రోజుకి మెరుగవుతోంది. మా కుటుంబ సభ్యులమంతా పల్లెకలె టెస్టును టీవీలో వీక్షించాము. హార్దిక్ టీ20 తరహా ఆటతో చెలరేగిపోతుంటే చాలా సంతోషమేసింది.
కెరీర్‌ తొలి టెస్టులోనే అర్ధశతకం బాదిన అతను.. మూడో టెస్టులోనే శతకం బాదడంతో మా ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది’ అని హిమాన్షు ఆనందం వ్యక్తం చేశాడు. పల్లెకలె టెస్టులో సెంచరీతో పాటు మాథ్యూస్ వికెట్ పడగొట్టిన హార్దిక్‌కి మ్యాన్‌ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించిన విషయం తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.