యాప్నగరం

ఫైనల్లో నం.1 ఆట ఆడలేదు: రాహుల్ ద్రవిడ్‌

ఐసీసీ అండర్‌-19 ప్రపంచ్‌కప్ గెలిచిన పృథ్వీషా సారథ్యంలోని జట్టుకు భారత్‌కు చేరుకుంది. అండర్-19 కోచ్, బ్యాటింగ్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ మీడియాతో మాట్లాడాడు.

TNN 5 Feb 2018, 11:39 pm
కప్ గెలవడం కంటే గత 16 నెలలుగా కష్టపడిన తీరు అన్నింటి కంటే ఎక్కువ సంతోషాన్ని ఇచ్చిందని అండర్-19 కోచ్, బ్యాటింగ్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ అన్నాడు. ఐసీసీ అండర్‌-19 ప్రపంచ్‌కప్ గెలిచిన పృథ్వీషా సారథ్యంలోని జట్టుకు భారత్‌కు చేరుకుంది. అభిమానులు ముంబైలో వీరికి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం కోచ్‌ ద్రవిడ్‌, యువ ఆటగాళ్లు మీడియాతో మాట్లాడారు.
Samayam Telugu we got the result but didnt play our number one game in final dravid
ఫైనల్లో నం.1 ఆట ఆడలేదు: రాహుల్ ద్రవిడ్‌


‘అండర్‌-19 క్రికెట్ కప్‌ గెలవడం చాలా గర్వంగా ఉంది. కానీ, మా జట్టు ఫైనల్‌ మ్యాచ్‌లో నంబర్‌వన్‌ ఆట ఆడలేదు. అయితే మేం కోరుకున్న ఫలితమే వచ్చింది. కుర్రాళ్లు ఇంకా అసలైన ఆటను బయటపెట్టాల్సి ఉంది’ అని ద్రవిడ్‌ అన్నాడు.

కష్టపడితే ఎలాంటి ఫలితం ఉంటుందో ఈ విజయం ద్వారా కుర్రాళ్లు తెలుసుకున్నారని, మంచి ఫలితాలు సాధించాలంటే దీన్ని ఇలాగే కొనసాగించాల్సిన అవసరం ఉందని ద్రవిడ్ అన్నాడు. కెరీర్లో మరింత ముందుకు వెళ్లడం అంత సులభం కాదని, 2012లో అండర్‌-19 ప్రపంచకప్‌ గెలిచిన జట్టులో ఒకరికి మాత్రమే టీమిండియాలో ఆడే అవకాశం వచ్చిందని ద్రవిడ్ గుర్తు చేశాడు.

యువ ఆటగాళ్లకు అసలు పరీక్ష ఇప్పుడే మొదలైందని ద్రవిడ్ అన్నాడు. కప్‌ గెలిచిన యువ జట్టుకు స్వదేశంలో లభించిన స్వాగతం పట్ల సంతోషం వ్యక్తం చేశాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.