యాప్నగరం

విండీస్‌కి రెండో టెస్టులోనూ జరిమానా

న్యూజిలాండ్‌తో సిరీస్‌లో విండీస్ జట్టు‌కి బ్యాడ్‌టైమ్ నడుస్తున్నట్లుంది. తొలి టెస్టులో స్లో ఓవర్‌ రేట్ కారణంగా జరిమానాతో

TNN 12 Dec 2017, 3:10 pm
న్యూజిలాండ్‌తో సిరీస్‌లో విండీస్ జట్టు‌కి బ్యాడ్‌టైమ్ నడుస్తున్నట్లుంది. తొలి టెస్టులో స్లో ఓవర్‌ రేట్ కారణంగా జరిమానాతో పాటు కెప్టెన్ జేసన్ హోల్డర్ సేవల్నీ కోల్పోయిన ఆ జట్టు.. హామిల్టన్ వేదికగా మంగళవారం ముగిసిన రెండో టెస్టులోనూ అదే తప్పిదానికి పాల్పడింది. దీంతో మ్యాచ్ రిఫరీ క్రిస్ బ్రాడ్ సూచన మేరకు విండీస్ తాత్కాలిక కెప్టెన్‌ క్రైగ్ బ్రాత్‌వైట్‌ మ్యాచ్ ఫీజులో 40 శాతం, ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధిస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది.
Samayam Telugu west indies fined for slow over rate in hamilton test
విండీస్‌కి రెండో టెస్టులోనూ జరిమానా


కేటాయించిన సమయంలో వేయాల్సిన ఓవర్ల కంటే విండీస్ ఒక ఓవర్‌ తక్కువగా వేసిందని మ్యాచ్ రిఫరీ వెల్లడించారు. వెల్లింగ్టన్ వేదికగా ముగిసిన తొలి టెస్టులోనూ మూడు ఓవర్లు తక్కువగా వేయడంతో కెప్టెన్ హోల్డర్ మ్యాచ్ ఫీజులో 60 శాతం, ఆటగాళ్ల ఫీజులో 30 శాతం ఐసీసీ కోత విధించింది. అప్పటికే ఏడాది వ్యవధిలో విండీస్ ఇదే తప్పిదానికి పాల్పడి ఉండటంతో కెప్టెన్ హోల్డర్‌ని రెండో టెస్టు నుంచి ఐసీసీ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. రెండు టెస్టుల ఈ సిరీస్‌ని న్యూజిలాండ్ 2-0తో కైవసం చేసుకుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.