యాప్నగరం

అదేం బాదుడు బాబోయ్.. బంతి కనబడలేదు

క్రిస్‌గేల్‌తో ఉప్పెనని ఊహించిన భారత్ బౌలర్లు.. అతడ్ని తొందరగానే పెవిలియన్‌కి పంపినా.. ఊహించిన ఈ కరీబియన్ యువ

TNN 10 Jul 2017, 9:54 am
ఎవిన్ లూయిస్.. టీ20లో భారత్‌పై మెరుపు శతకం బాది రాత్రికి రాత్రే స్టార్ క్రికెటర్ అయిపోయాడు. ఆదివారం రాత్రి జరిగిన ఏకైక టీ20 మ్యాచ్‌లో 191 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన వెస్టిండీస్ జట్టు ఎవిన్ లూయిస్ (125: 62 బంతుల్లో 6x4, 12x6) హిట్టింగ్‌తో మరో 9 బంతులు మిగిలి ఉండగానే 9 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లో భారీ సిక్స్‌తో తన ఉద్దేశంలో చాటిన లూయిస్.. విన్నింగ్ షాట్‌ రూపంలో సిక్స్ కొట్టే వరకూ అదే జోరును కొనసాగించాడు. ఆరంభంలోనే రెండు క్యాచ్‌ల్ని మహ్మద్ షమీ, దినేశ్ కార్తీక్ జారవిడచడంతో బతికిపోయిన ఎవిన్.. తర్వాత ఎలాంటి ఛాన్స్‌‌ని భారత్‌కు ఇవ్వలేదు.
Samayam Telugu west indies to nine wicket win against india
అదేం బాదుడు బాబోయ్.. బంతి కనబడలేదు


మ్యాచ్‌లో స్పిన్నర్లని లక్ష్యంగా చేసుకుని లూయిస్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. బంతి ఎలాంటిదైనా.. తన పవర్ హిట్టింగ్ అలవోకగా స్టాండ్స్‌లోకి తరలించేశాడు. ముఖ్యంగా ఇన్నింగ్స్ ఏడో ఓవర్ వేసిన కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో తొలి బంతినే కళ్లుచెదిరే రీతిలో స్టేడియం వెలుపలకి సిక్స్‌గా కొట్టేశాడు. మరోసారి జడేజా బౌలింగ్‌లో కూడా ఒక బంతిని అలానే స్టేడియం పైకప్పుపైకి తరలించాడు. దీంతో అంపైర్లు కొత్త బంతిని తీసుకోవాల్సి వచ్చింది. క్రిస్‌గేల్‌తో ఉప్పెనని ఊహించిన భారత్ బౌలర్లు.. అతడ్ని తొందరగానే పెవిలియన్‌కి పంపినా.. ఊహించిన ఈ కరీబియన్ యువ హిట్టర్ దాటికి బెంబేలెత్తిపోయారు. టీ20ల్లో ఇప్పటి వరకు లూయిస్ రెండు శతకాలు చేయగా.. రెండూ భారత్‌పైనే కావడం శోచనీయం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.