యాప్నగరం

IND vs WI: ఈరోజే రెండో వన్డే.. హెడ్ టు హెడ్ రికార్డులతో విండీస్‌లో కంగారు!

India vs West Indies 2nd T20I మ్యాచ్‌కి సెయింట్స్ కిట్స్ స్టేడియం సిద్ధమైంది. ట్రినిడాడ్‌లో వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో వెస్టిండీస్‌ని చిత్తు చేసిన భారత్.. అదే జోరుని కొనసాగించాలని ఉవ్విళ్లూరుతోంది.

Authored byరాజేంద్ర గాలేటి | Samayam Telugu 1 Aug 2022, 2:56 pm

ప్రధానాంశాలు:

  • భారత్, వెస్టిండీస్ మధ్య ఈరోజు రెండో టీ20
  • తొలి టీ20లో 68 పరుగుల తేడాతో గెలిచిన భారత్
  • హెడ్ టు హెడ్ రికార్డుల్లో భారత్‌దే ఆధిపత్యం
  • చివరిగా జరిగిన ఐదు టీ20ల్లోనూ టీమిండియాదే గెలుపు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu India vs West Indies (Pic Source: Twitter)
India vs West Indies (Pic Source: Twitter)
వెస్టిండీస్‌ని తొలి టీ20లో అలవోకగా ఓడించేసిన భారత్ జట్టు.. ఈరోజు రాత్రి 8 గంటలకి రెండో టీ20లో తలపడబోతోంది. ట్రినిడాడ్‌లో జులైలో జరిగిన నాలుగు మ్యాచ్‌ల్లో (మూడు వన్డేలు, ఒక టీ20) విండీస్‌ని భారత్ జట్టు ఓడించేసింది. కానీ.. ఈరోజు మ్యాచ్ సెయింట్ కిట్స్ స్టేడియంలో జరగబోతుండటంతో.. భారత్ జైత్రయాత్రకి బ్రేక్ వేయాలని విండీస్ పట్టుదలతో ఉంది.
వెస్టిండీస్, భారత్ మధ్య టీ20ల్లో హెడ్ టు హెడ్ రికార్డుల్ని పరిశీలిస్తే? ఇప్పటి వరకూ 21 టీ20ల్లో ఈ రెండు జట్లు తలపడ్డాయి. ఇందులో టీమిండియా 14 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా.. వెస్టిండీస్ ఆరు మ్యాచ్‌ల్లో గెలుపొందింది. ఇక మిగిలిన ఒక మ్యాచ్‌లో మాత్రం ఫలితం తేలలేదు. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే? చివరిగా ఆడిన ఐదు టీ20ల్లోనూ భారత్ జట్టే గెలుపొందింది.

ట్రినిడాడ్ వేదికగా గత శుక్రవారం రాత్రి జరిగిన తొలి టీ20లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 6 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేదనలో తడబడిన వెస్టిండీస్ టీమ్ 20 ఓవర్లలో 122/8కే పరిమితమైంది. దాంతో.. 68 పరుగుల తేడాతో గెలిచిన భారత్ జట్టు ఇప్పుడు మంచి జోరుమీదుండగా.. సొంతగడ్డపై వరుసగా మ్యాచ్‌ల్ల్ ఓడిపోతున్న విండీస్ తీవ్ర ఒత్తిడిలో ఉంది.
రచయిత గురించి
రాజేంద్ర గాలేటి
గాలేటి రాజేంద్ర సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ స్పోర్ట్స్, సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాస్తుంటారు. క్రికెట్ అంటే అమితమైన ఇష్టం. మ్యాచ్‌లకి సంబంధించి ఆసక్తికరమైన కథనాల్ని అందిస్తుంటారు. ఈయనకి జర్నలిజంలో 10 ఏళ్లకి పైగా అనుభవం ఉంది. గతంలో ఈనాడు.నెట్‌లో పనిచేశారు. అంతకముందు జర్నలిజంలో పీజీ చేయడంతో పాటు ఈనాడు జర్నలిజం స్కూల్‌లో శిక్షణ పొందారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.