యాప్నగరం

పాక్ ఆటగాడిపై ఆస్ట్రేలియా స్లెడ్జింగ్..!

2015 నుంచి మోకాలి గాయంతో ఇబ్బంది పడుతున్న సోహైల్.. ఇటీవల మళ్లీ ఫిట్‌నెస్ సాధించి జట్టులోకి వచ్చాడు.

Samayam Telugu 9 Oct 2018, 4:50 pm
దుబాయ్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆటగాళ్లు తనని స్లెడ్జింగ్‌తో ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నించారని పాకిస్థాన్ బ్యాట్స్‌మెన్ హరీశ్ సొహైల్ ఆరోపించాడు. గత ఆదివారం మొదలైన ఈ టెస్టు మ్యాచ్‌లో హరీశ్ సోహైల్ (110: 240 బంతుల్లో 8x4, 2x6), మహ్మద్ హఫీజ్ (126: 208 బంతుల్లో 15x4) శతకాలు బాదడంతో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ జట్టు 164.2 ఓవర్లలో 482 పరుగులకి ఆలౌటైంది. 2015 నుంచి మోకాలి గాయంతో ఇబ్బంది పడుతున్న సోహైల్.. ఇటీవల మళ్లీ ఫిట్‌నెస్ సాధించి జట్టులోకి వచ్చాడు.
Samayam Telugu haris-sohail-759


‘నేను అమాయకుడ్ని (నవ్వుతూ).. కానీ.. ఆస్ట్రేలియా ఆటగాళ్లు నాపై స్లెడ్జింగ్‌కి (అసందర్భ పదజాలం వాడటం) ప్రయత్నించారు. దీంతో.. బ్యాటింగ్ చేస్తున్నంతసేపు వారివైపు చూడటం మానేశాను. అయినప్పటికీ రెండు మూడు సార్లు వారు స్లెడ్జింగ్‌కి ట్రై చేశారు. ఆఖరిగా.. నేను వారి మాటలు విననట్లే నటించాను. గత మూడేళ్లుగా గాయంతో నేను బాధపడ్డాను. చాలా అంశాలు నాకు ప్రతికూలంగా జరిగాయి. అయినప్పటికీ.. పట్టుదలతో ఫిట్‌నెస్ సాధించి.. మళ్లీ జట్టులోకి పునరాగమనం చేయడం ఆనందంగా ఉంది ’అని సోహైల్ వెల్లడించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.