యాప్నగరం

హార్దిక్ పాండ్యాని ఎంగిలి ప్లేట్స్ ఎత్తమన్నారు

భారత నయా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాని డాబాలో ఎంగిలి ప్లేట్ల్స్ ఎత్తమన్నారట. ఈ విషయాన్ని హార్దిక్ పాండ్యానే స్వయంగా

TNN 9 Dec 2017, 5:43 pm
భారత నయా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాని డాబాలో ఎంగిలి ప్లేట్స్ ఎత్తమన్నారట. ఈ విషయాన్ని హార్దిక్ పాండ్యానే స్వయంగా ఇటీవల ఓ టీవీకిచ్చిన ఇంటర్వ్యూలో బహిర్గతం చేశాడు. చిన్న వయసులో తాను చాలా పొట్టిగా హెయిర్‌ స్టైల్‌ చేయించుకునేవాడినని.. దాంతో అందరూ తనని వెయిటర్‌గా భ్రమపడి అలా ఆర్డర్స్ పాస్ చేసేవారంటూ ఈ నయా ఆల్‌రౌండర్ గుర్తు చేసుకున్నాడు. శ్రీలంకతో టెస్టు సిరీస్‌ ఆడకుండా విశ్రాంతి తీసుకున్న హార్దిక్.. ఆదివారం నుంచి జరగనున్న వన్డే సిరీస్‌తో మళ్లీ టీమిండియాలోకి పునరాగమనం చేయనున్నాడు.
Samayam Telugu when hardik pandya was mistaken for a waiter
హార్దిక్ పాండ్యాని ఎంగిలి ప్లేట్స్ ఎత్తమన్నారు


‘నేను ఎప్పుడూ భిన్నమైన కేశాలంకరణతో ఉండటానికి ఇష్టపడతాను. అందులో భాగంగానే చాలా పొట్టిగా హెయిర్ కటింగ్ చేయిస్తాను. మా అమ్మ తోడు లేకుండా నేను ఎప్పుడూ డాబాల్లో భోజనం చేయడానికి వెళ్లేవాడిని కాదు. ఎందుకంటే.. నేను ఒక్కడినే వెళ్తే అందరూ నన్ను వెయిటర్‌గా భ్రమపడి పనులు చెప్తారు. అలా చాలా సార్లు వింత అనుభవం నాకు ఎదురైంది. ఒక్కోసారి భోజనం చేసి నేను చేతులు శుభ్రం చేసుకోవడానికి వెళ్తుంటే.. పిలిచి మరీ.. టేబుల్‌పై ఎంగిలి ప్లేట్స్‌ తీయమని, ఆర్డర్ తీసుకోమని కస్టమర్స్‌ చెప్తుంటారు’ అని హార్దిక్ వివరించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.