యాప్నగరం

జడ్డూ అది బౌల్డ్.. జడేజాతో ఆటాడుకున్న టీమ్ మేట్స్!

నాలుగో రోజు చివరి ఓవర్లో రవీంద్ర జడేజా క్లీన్ బౌల్డ్ చేసి కూడా వికెట్ కోసం అంపైర్‌కి అప్పీల్ చేశాడు.

TNN 5 Dec 2017, 5:46 pm
భారత్, శ్రీలంక మధ్య టెస్టు సిరీస్ ముగింపు దశకు వచ్చింది. చివరి రోజు లంక విజయానికి 379 పరుగులు అవసరం కాగా, కోహ్లి సేన గెలవాలంటే.. ఏడు వికెట్లు పడగొట్టాలి. ఆట నాలుగో రోజు భారత బ్యాట్స్‌మెన్ వేగంగా పరుగులు రాబట్టారు. దీంతో 246/5 వద్ద విరాట్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు. 410 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన లంక జట్టు నాలుగో రోజే మూడు వికెట్లు చేజార్చుకుంది. షమీ చక్కటి బౌలింగ్‌తో సమరవిక్రమను పెవిలియన్ చేర్చగా.. జడేజాకు రెండు వికెట్లు దక్కాయి.
Samayam Telugu when ravindra jadeja didnt realise it was out
జడ్డూ అది బౌల్డ్.. జడేజాతో ఆటాడుకున్న టీమ్ మేట్స్!


నాలుగో రోజు చివరి ఓవర్‌ వేసేందుకు కోహ్లి జడేజా చేతికి బంతిని అప్పగించాడు. ఆ ఓవర్ తొలి బంతికే కరుణరత్నేను పెవిలియన్ చేర్చిన జడేజా.. నాలుగో బంతికి నైట్ వాచ్‌మెన్ లక్మల్‌ను అవుట్ చేశాడు. అప్పుడే క్రీజ్‌లోకి వచ్చిన లక్మల్ జడ్డూ విసిరిన బంతిని సరిగా అర్థం చేసుకోలేకపోయాడు. బ్యాట్‌ను పూర్తిగా కిందకు వంచేలోగానే అది బ్యాట్ అంచును తాకుతూ వికెట్‌ను గిరాటేసింది.

కానీ అది బౌల్డ్ అనే విషయాన్ని గమనించని జడేజా అవుట్ కోసం అంపైర్‌కు అపీల్ చేశాడు. కాసేపట్లోనే వాస్తవాన్ని గ్రహించి నవ్వుతూ సంబరాలు చేసుకున్నాడు. ఈలోగా ఇతర క్రికెటర్లు జడేజాను ఆటపట్టించారు. క్రికెట్ వ్యాఖ్యాతలు కూడా జడ్డూను చూసి నవ్వుకున్నారు. తర్వాత తను అలా ఎందుకు చేశాననే విషయమై జడేజా సహచర క్రికెటర్లకు వివరణ ఇచ్చుకున్నాడు.


When Jadeja didn't realise it was OUT https://t.co/EKai5su35t — Ravikumar (@ravitedz) December 5, 2017

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.