యాప్నగరం

సచిన్‌పై స్లెడ్జింగ్.. సిగ్గుతో సారీ చెప్పిన పాక్ స్పిన్నర్

భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ అంటేనే భావోద్వేగాల సమూహారం. ప్రతి బంతినీ బౌలర్‌ కసిగా విసిరితే.. బ్యాట్స్‌మెన్ అదే రీతిలో బదులిచ్చేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇక మ్యాచ్‌లో కవ్వింపులు, స్లెడ్జింగ్ షరా మామూలే.

Samayam Telugu 24 Apr 2020, 8:01 pm
భారత దిగ్గజ క్రికెటర్‌ సచిన్ టెండూల్కర్‌ని స్లెడ్జింగ్ చేసినందుకు తాను సిగ్గుపడ్డానని పాకిస్థాన్ మాజీ స్పిన్నర్ సక్లైన్ ముస్తాక్ వెల్లడించాడు. 1990లో పోటాపోటీగా మైదానంలో తలపడిన సచిన్, ముస్తాక్.. ఆధిపత్యం చెలాయించే ప్రయత్నం చేశారు. కానీ.. ఈ క్రమంలో తాను హద్దులు దాటి సచిన్‌పై స్లెడ్జింగ్‌కి పాల్పడగా.. అతను మాత్రం హుందాగా జవాబిచ్చి తాను సిగ్గుపడేలా చేసినట్లు తాజాగా ముస్తాక్ చెప్పుకొచ్చాడు.
Samayam Telugu Sachin Tendulkar vs Saqlain Mushtaq


Read More: ఐపీఎల్ కోసం ఆసియా కప్ షెడ్యూల్‌ని మార్చబోం: పాక్ బోర్డు

‘‘1997లో సహారా కప్ అనుకుంటా.. సచిన్‌ని తొలిసారి స్లెడ్జింగ్ చేశాను. కానీ.. సచిన్ మాత్రం హుందాగా నా వద్దకు వచ్చి.. నేను ఎప్పుడూ నీ దగ్గర మిస్‌బిహేవ్ చేయలేదు. మరి నువ్వు ఎందుకు నాతో ఇలా తప్పుగా ప్రవర్తిస్తున్నావ్..? అని అడిగాడు. దాంతో సచిన్‌కి ఏం సమాధానం చెప్పాలో నాకు అర్థంకాక సిగ్గుతో తలదించుకున్నాను. ఆ మ్యాచ్‌ తర్వాత సచిన్‌కి సారీ చెప్పిన నేను.. మళ్లీ ఎప్పుడూ అతనిపై స్లెడ్జింగ్‌కి దిగలేదు’’ అని ముస్తాక్ వెల్లడించాడు.

Read More: బర్త్‌డే రోజే ఆస్ట్రేలియాకి చుక్కలు చూపిన సచిన్

16 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన సచిన్ టెండూల్కర్.. తొలి మ్యాచ్‌లోనే పాకిస్థాన్‌తో మ్యాచ్‌లు ఆడాడు. 24 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో 100 శతకాలు బాదిన టెండూల్కర్‌ వివాదరహితుడిగా పేరుంది. అయితే.. సచిన్ కూడా తమని స్లెడ్జింగ్ చేశాడని ఆస్ట్రేలియా క్రికెటర్లు అప్పట్లో ఆరోపించారు. కానీ.. అవి ఎప్పుడూ హద్దులు దాటలేదు కాబట్టి.. వెలుగులోకి రాలేదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.