యాప్నగరం

​ మలింగ @300.. కెప్టెన్ కోహ్లి ఔట్..!

శ్రీలంక తాత్కాలిక కెప్టెన్ లసిత్ మలింగ తన కెరీర్‌లో అరుదైన మైలురాయిని అందుకున్నాడు. భారత్‌తో గురువారం కొలంబో వేదికగా జరుగుతున్న

TNN 31 Aug 2017, 4:53 pm
శ్రీలంక తాత్కాలిక కెప్టెన్ లసిత్ మలింగ తన కెరీర్‌లో అరుదైన మైలురాయిని అందుకున్నాడు. భారత్‌తో గురువారం కొలంబో వేదికగా జరుగుతున్న నాలుగో వన్డే‌లో కెప్టెన్ విరాట్ కోహ్లి వికెట్ తీసిన మలింగ కెరీర్‌లో 300వ వన్డే వికెట్‌‌ని ఖాతాలో వేసుకున్నాడు. 2004, జులై 17న వన్డే క్రికెట్‌‌లోకి అరంగేట్రం చేసిన ఈ ఫాస్ట్ బౌలర్ అనతికాలంలోనే జట్టులో సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు. తాజాగా అతను 203వ వన్డే ఆడుతున్నాడు.
Samayam Telugu wicket number 300 for malinga kohli falls after blistering hundred
​ మలింగ @300.. కెప్టెన్ కోహ్లి ఔట్..!


యార్కర్‌ రూపంలో విసిరిన బంతిని విరాట్ కోహ్లి (131: 96 బంతుల్లో 17x4, 2x6) కవర్స్ దిశగా బౌండరీకి తరలించేందుకు ప్రయత్నించాడు. అయితే.. ఫీల్డర్ మునవీర దిల్షాన్ అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న విషయాన్ని కోహ్లి గుర్తించలేకపోయినట్లు తెలుస్తోంది. అప్పటికే ఆ ప్రదేశంలో రెండు.. మూడు బౌండరీలు బాదిన కోహ్లి.. మరో బౌండరీ కోసం ప్రయత్నిస్తూ అతని చేతికి చిక్కిపోయాడు. దిల్షాన్ క్యాచ్ అందుకునేందుకు నిల్చొన్న చోట నుంచి ఎక్కడికీ కదలాల్సిన అవసరం లేకపోయింది. దీనిబట్టి మలింగ వ్యూహం ప్రకారమే.. కోహ్లిని బుట్టలో వేసినట్లు తెలుస్తోంది. అప్పటికి భారత్ స్కోరు 29.3 ఓవర్లలో 225/2.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.