యాప్నగరం

విజ్డన్ లీడింగ్ క్రికెటర్లుగా కోహ్లి, మిథాలీ

మిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి వరుసగా రెండో ఏడాది విజ్డన్ లీడింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యాడు. మహిళల విభాగంలో మిథాలీ రాజ్ ఈ ఘనత సాాధించింది.

Samayam Telugu 11 Apr 2018, 3:22 pm
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి వరుసగా రెండో ఏడాది విజ్డన్ లీడింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యాడు. 29 ఏళ్ల కోహ్లి గత ఏడాది అన్ని ఫార్మాట్లూ కలుపుకొని 2818 పరుగులు రాబట్టాడు. 2017లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఇంగ్లాండ్ ఆటగాడు జో రూట్ రెండో స్థానంలో ఉన్నాడు. రూట్ కంటే కోహ్లి 700కిపైగా పరుగులు ఎక్కువ చేయడం విశేషం.
Samayam Telugu virat mithali


మహిళా క్రికెటర్ల విషయానికి వస్తే.. మిథాలీ రాజ్ లీడింగ్ విమెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికైంది. గత ఏడాది అత్యధిక పరుగులు రాబట్టిన మహిళా క్రికెటర్‌గా మిథాలీ రికార్డ్ నెలకొల్పింది. వరుసగా ఏడు అర్ధ శతకాలు సాధించిన ఏకైక మహిళా క్రికెటర్ మిథాలీ రికార్డు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.

విజ్డన్ ఈ ఏడాది ఐదుగురు ఆటగాళ్లను క్రికెటర్స్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపిక చేసింది. గత ఏడాది తమ జట్టుకు వరల్డ్ కప్ అందించిన ముగ్గురు ఇంగ్లాండ్‌ మహిళా క్రికెటర్లకు క్రికెటర్స్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించింది. వరల్డ్ కప్ ఫైనల్లో భారత్‌పై 6 వికెట్లు తీసిన అన్యా శ్రుబోస్లే, ఇంగ్లాండ్ కెప్టెన్ హీథర్ నైట్, ఆల్‌రౌండర్ నటాలీ సీవెర్‌లు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచారు.

విండీస్ బ్యాట్స్‌మెన్ షాయ్ హోప్, ఎస్సెక్స్ పేసర్ జమీ పోర్టర్‌లు కూడా విజ్డన్ క్రికెటర్స్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.