యాప్నగరం

పాక్‌పై ఫీల్డింగ్‌ ఎంచుకున్న వరల్డ్ ఎలెవన్

పాకిస్థాన్‌తో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో వరల్డ్ ఎలెవన్ జట్టు కెప్టెన్ డుప్లెసిస్ టాస్ గెలిచి

TNN 12 Sep 2017, 7:34 pm
పాకిస్థాన్‌తో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో వరల్డ్ ఎలెవన్ జట్టు కెప్టెన్ డుప్లెసిస్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. లాహోర్‌లో శ్రీలంక క్రికెటర్లు ప్రయాణిస్తున్న బస్సుపై 2009లో మిలిటెంట్లు దాడి చేసిన అనంతరం ఏ అగ్రశ్రేణి జట్టు కూడా భద్రతా కారణాలతో పాక్‌లో పర్యటించే సాహసం చేయలేదు. దీంతో పతనావస్థకి చేరిపోయిన పాకిస్థాన్‌ క్రికెట్‌ని మళ్లీ పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ఆ దేశ బోర్డు.. ప్రపంచవ్యాప్తంగా పేరున్న క్రికెటర్లని వరల్డ్ ఎలెవన్ జట్టుగా చేర్చి మూడు టీ20ల సిరీస్‌ నిర్వహిస్తోంది.
Samayam Telugu world xi opt to bowl first against pakistan
పాక్‌పై ఫీల్డింగ్‌ ఎంచుకున్న వరల్డ్ ఎలెవన్


గడాఫీ వేదికగా జరుగుతున్న ఈ టీ20 మ్యాచ్‌కి అసాధారణ భద్రతా ఏర్పాట్లు చేశారు. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత.. మళ్లీ వివిధ దేశాలకి చెందిన అంతర్జాతీయ క్రికెటర్లు పాకిస్థాన్‌లో క్రికెట్ ఆడుతుండటంతో మ్యాచ్‌ని వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు.

.@faf1307 won the toss for World XI and elected to bowl first #PAKvWXI #CricketKiHalalala pic.twitter.com/nY2riGSFJP — PCB Official (@TheRealPCB) September 12, 2017
వరల్డ్ ఎలెవన్ జట్టు: తమీమ్ ఇక్బాల్, హసీమ్ ఆమ్లా, డుప్లెసిస్ (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, గ్రాంట్ ఇలియట్, తిసార పెరీరా, టిమ్ పైనీ, బెన్ కటింగ్, డారెన్ సామీ, మోర్నీ మోర్కెల్, ఇమ్రాన్ తాహిర్

పాకిస్థాన్ జట్టు: అహ్మద్ షెహజాద్, ఫకార్ జమాన్, బాబర్ అజామ్, షోయబ్ మాలిక్, సర్ఫరాజ్ అహ్మద్, ఇమాద్ వసీం, అష్రప్, షదాబ్ ఖాన్, సోహాలీ ఖాన్, హసన్ అలీ, రుమార్ రాయిస్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.