యాప్నగరం

భారత్‌లో వాళ్లిద్దరే బెస్ట్ వికెట్ కీపర్లు: గంగూలీ

MS Dhoni స్థానాన్ని భర్తీ చేయగలిగే వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ ఎవరనే ప్రశ్నకు గంగూలీ సమాధానం చెప్పాడు. ప్రస్తుతం పంత్, సాహా ఇద్దరు బెస్ట్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ అని చెప్పాడు.

Samayam Telugu 25 Nov 2020, 12:12 pm
Samayam Telugu ​Sourav Ganguly
అంతర్జాతీయ క్రికెట్ నుంచి మహేంద్ర సింగ్ ధోనీ రిటైరయ్యాక.. అతడి స్థానాన్ని భర్తీ చేసే వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ ఎవరనే ప్రశ్న తలెత్తింది. రిషబ్ పంత్ నంబర్ వన్ ఛాయిస్ ఆటగాడు అయినప్పటికీ.. బ్యాటింగ్‌లో నిలకడ లేమి అతడికి శాపమైంది. దీంతో పరిమిత ఓవర్ల క్రికెట్లో కేఎల్ రాహుల్.. టెస్టుల్లో వృద్ధిమాన్ సాహాకు వికెట్ కీపింగ్ బాధ్యతలు దక్కే అవకాశం ఉంది. టీ20ల్లో దూకుడుగా ఆడే సంజూ శాంసన్ కూడా వికెట్ కీపర్ రేసులో ఉన్నాడు.

కాగా ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు ముందు మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ ప్రస్తుత భారత క్రికెట్లో ఇద్దరు బెస్ట్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌లెవరో వెల్లడించాడు. ఐపీఎల్ 2020లో ఆకట్టుకోలేకపోయిన రిషబ్ పంత్‌ను దాదా వెనకేసుకొచ్చాడు. పంత్, సాహా ఇద్దరూ మన బెస్ట్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ అని గంగూలీ తెలిపాడు.

ఐపీఎల్‌లో పంత్ తన సహజసిద్ధమైన ఆటతీరు కనబర్చలేకపోయినా.. అతడిలో అద్భుతమైన టాలెంట్ ఉందని.. కచ్చితంగా జట్టులోకి వస్తాడని దాదా విశ్వాసం వ్యక్తం చేశాడు. పంత్ యువ ఆటగాడని.. అతడికి సలహాలు, సూచనలు అవసరమని తెలిపాడు.

టెస్టు సిరీస్‌లో పంత్‌కు ఆడే అవకాశం కల్పిస్తారా అని ప్రశ్నించగా.. సాహా మెరుగైన వికెట్ కీపర్ అని.. బ్యాటింగ్‌లోనూ ఫామ్‌లో ఉన్నాడని.. ఎవరు మంచి ఫామ్‌లో ఉంటే వారు ఆడుతారనడం ద్వారా సాహాకే ఛాన్స్ ఉందని పరోక్షంగా చెప్పాడు. నవంబర్ 27న ప్రారంభం కానున్న పరిమిత ఓవర్ల సిరీస్‌లో పంత్‌కు చోటు దక్కలేదు. దీంతో కేఎల్ రాహుల్, సంజూ శాంసన్‌లను వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గా ఎంపిక చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.