యాప్నగరం

సాహా భార్య కోరిక.. ధోనీ ఫ్యాన్స్‌ ఫైర్..?

భారత టెస్టు జట్టు వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా భార్య కోరిక.. మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ అభిమానులకి కోపం

TNN 12 Sep 2017, 8:49 pm
భారత టెస్టు జట్టు వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా భార్య కోరిక.. మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ అభిమానులకి కోపం తెప్పించింది. కోల్‌కతాలో ఓ మ్యూజిక్ సీడీ ఆవిష్కరణ కార్యక్రమానికి మంగళవారం హాజరైన సాహా మీడియాతో మాట్లాడుతూ ‘నా భార్య ఒక కోరిక కోరింది. రాబోవు ప్రపంచకప్‌లో భారత్ జట్టు తరఫున నన్ను ఆడాలని కోరింది’ అని వెల్లడించాడు. మరో ఆరు నెలల్లో 2019 ప్రపంచకప్‌‌‌లో బరిలోకి దిగబోయే భారత జట్టుపై ఒక స్పష్టత వస్తుందని ఇప్పటికే చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇటీవల శ్రీలంకతో ముగిసిన వన్డే సిరీస్‌లోనూ 36 ఏళ్ల ధోనీ.. మునుపటి ఫామ్ అందుకుని వరుస అర్ధ శతకాలు బాదేశాడు. ఈ తరుణంలో సాహా భార్య ధోనీ స్థానంలో తన భర్తని ప్రపంచకప్‌ జట్టులో చూడాలనుకోవడంపై ధోనీ అభిమానులు ఫైర్ అవుతున్నారు.
Samayam Telugu wriddhiman saha hopeful of playing 2019 world cup
సాహా భార్య కోరిక.. ధోనీ ఫ్యాన్స్‌ ఫైర్..?


‘వన్డే జట్టులో స్థానం సంపాదించమని ఆమె నన్ను అనునిత్యం ప్రోత్సహిస్తోంది. నేను కూడా చాలా ప్రయత్నిస్తున్నాను. కానీ.. తుది నిర్ణయం సెలక్టర్లే కదా..!’ అని 32 ఏళ్ల సాహా వెల్లడించాడు. టెస్టులకి ధోనీ రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత.. అతని స్థానంలో దాదాపు 28 టెస్టు మ్యాచ్‌లను సాహా ఆడాడు. 2014లో చివరి సారి శ్రీలంకపై వన్డే మ్యాచ్‌ ఆడిన సాహా.. కెరీర్‌లో మొత్తం 9 వన్డేలాడి కనీసం ఒక అర్ధశతకం కూడా సాధించలేకపోయాడు. వన్డేల్లో అతని అత్యధిక స్కోరు 16 మాత్రమే. దీంతో ఇలాంటి బ్యాట్స్‌మెన్‌ని ధోనీ స్థానంలో ప్రపంచకప్ ఆడమని కోరుతావా..? అంటూ అభిమానులు సాహా భార్యని విమర్శిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.