యాప్నగరం

మణికట్టు స్పిన్నర్‌ను కాదు, వేళ్లతోనే తిప్పేస్తా: రషీద్

టీ20ల్లో తిరుగులేని బౌలర్ అయిన రషీద్ ఖాన్.. తాను మణికట్టు స్పిన్నర్ కాదని.. ఫింగర్ స్పిన్నర్ అని చెప్పడానికే ఇష్టపడతానని చెప్పాడు.

Samayam Telugu 5 Jun 2018, 4:05 pm
టీ20ల్లో ప్రపంచ నంబర్ 1 బౌలర్ అతడంటూ రషీద్ ఖాన్‌ను ఉద్దేశించి సచిన్ టెండుల్కర్ చేసిన ట్వీట్ చాలు.. ఈ అప్ఘాన్ స్పిన్నర్ గొప్పదనమేంటో చెప్పడానికి. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ తరఫున బరిలో దిగిన ఈ స్పిన్నర్ అద్భుత ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. క్వాలిఫయర్ మ్యాచ్‌లోనైతే బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో తిరుగులేని ఆటతో జట్టును ఒంటి చేత్తో ఫైనల్ చేర్చాడు.
Samayam Telugu rashid4


రషీద్‌ను అద్భుతమైన మణికట్టు స్పిన్నర్ అని అందరూ పిలుస్తుంటే.. తను మాత్రం మణికట్టు కంటే ఎక్కువగా వేళ్ల కొనలతోనే బంతిని తిప్పుతానంటున్నాడు. ఇలా వేలి కొనలతో బంతిని తిప్పడం వల్ల వేగంగా విసరడానికి అవకాశం లభిస్తుందని చెబుతున్నాడు.

‘‘లెగ్ స్పిన్ ఎలా వేయాలో నాకెవరూ చెప్పలేదు. ఆ అవకాశం కూడా నాకు లేదు. కాకపోతే ఐదారేళ్ల క్రితం షాహిద్ అఫ్రిదీ, అనిల్ కుంబ్లేల వీడియోలను చూసేవాణ్ని. ఇప్పటికీ ఖాళీ సమయాల్లో కుంబ్లే బౌలింగ్ వీడియోలను చూస్తుంటా’’ అని రషీద్ చెప్పాడు.

గతేడాది ఐపీఎల్ సీజన్ ముగిశాక ఇంటికెళ్లినప్పుడు ఏర్పాటు చేసిన కార్యక్రమం నన్నెంతో ఆకట్టుకుంది. ఆ క్షణాలను ఎప్పటికీ మర్చిపోలేనని రషీద్ చెప్పాడు. ఒంటరిగా అనిపించినప్పుడు పడుకోవడానికి ప్రయత్నిస్తాను. గ్రీన్ టీ తాగి రిలాక్స్ అవుతా. ఇంకేం చేయనని ఈ అప్ఘాన్ యువ సంచలనం చెప్పాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.