యాప్నగరం

డోపింగ్ టెస్టులో పట్టుబడిన పఠాన్

భారత సీనియర్ ఆల్‌రౌండర్ యూసఫ్ పఠాన్ నిషేధిత ఉత్ప్రేరకాలు వాడి డోప్ టెస్టులో దొరికిపోయినట్లు ఆలస్యంగా

TNN 9 Jan 2018, 2:40 pm
భారత సీనియర్ ఆల్‌రౌండర్ యూసఫ్ పఠాన్ నిషేధిత ఉత్ప్రేరకాలు వాడి డోప్ టెస్టులో దొరికిపోయినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో అతడ్ని సస్పెండ్‌ చేస్తూ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మంగళవారం సంచలన నిర్ణయం తీసుకుంది. 2011 ప్రపంచకప్‌ గెలిచిన భారత్ జట్టులో సభ్యుడిగా ఉన్న యూసఫ్ పఠాన్ గత కొంతకాలంగా పేలవ ఫామ్‌తో టీమిండియాకి దూరంగా ఉంటున్నాడు. గత ఏడాది దేశవాళీ క్రికెట్‌ మ్యాచ్‌ల సందర్భంగా పఠాన్‌కి డోప్ పరీక్షలు నిర్వహించగా.. వాటిలో అతను విఫలమైనట్లు బీసీసీఐ ప్రకటించింది.
Samayam Telugu yusuf pathan suspended by bcci after dope violation says he took cough syrup
డోపింగ్ టెస్టులో పట్టుబడిన పఠాన్


2017, మార్చి 16న దేశవాళీ టీ20 సిరీస్ ఆడుతున్న సమయంలో పఠాన్ నుంచి నమూనాలను సేకరించగా.. అక్టోబరు 27న పరీక్షలకి సంబంధించి పూర్తి నివేదిక వచ్చినట్లు బీసీసీఐ వెల్లడించింది. అతను వరల్డ్‌ యాంటీ డోపింగ్‌ ఏజెన్సీ (వాడా) నిషేధించిన జాబితాలోని పదార్థాన్ని తీసుకున్నట్లు నిర్ధరణ కావడంతోనే గత ఏడాది చివర్లో ఆరంభమైన రంజీ ట్రోఫీ ఆడకుండా అడ్డుకున్నట్లు బోర్డు తాజాగా ఓ ప్రకటనలో వివరించింది. జట్టులోకి యూసఫ్ పఠాన్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోవద్దంటూ బరోడా జట్టుకి అప్పుడే బోర్డు నుంచి స్పష్టమైన ఆదేశాలు వెళ్లినట్లు తెలుస్తోంది. 2013 ఐపీఎల్ సమయలో నిర్వహించిన డోప్ టెస్టులో కోల్‌కతా నైట్‌రైడర్స్ క్రికెటర్ ప్రదీప్ సంగ్వాన్ పట్టుబడిన విషయం తెలిసిందే. దీంతో తాజాగా డోప్‌ టెస్టులో పట్టుబడిన రెండో భారత క్రికెటర్‌గా పఠాన్ నిలిచాడు. అనారోగ్యం కారణంగా తాను కేవలం దగ్గు మందు మాత్రమే వాడినట్లు బీసీసీఐకి పఠాన్ వివరణ ఇచ్చినట్లు సమాచారం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.