యాప్నగరం

యువరాజ్‌ సింగ్‌పై గృహ హింస కేసు

క్రికెటర్ యువరాజ్ సింగ్‌పై గృహహింస చట్టం కింద కేసు నమోదైంది. యువరాజ్ సోదరుడు జోరావార్ సింగ్ భార్య ఆకాంక్ష శర్మ ఈ కేసు పెట్టారు. యువీతో పాటు అతడి సోదరుడు జోరావార్, తల్లి షబనమ్ సింగ్‌పై ఆమె గృహ హింస కేసు ఫైల్ చేశారు. అక్టోబర్ 21న ఈ కేసు విచారణకు రానుంది.

TNN 18 Oct 2017, 12:30 pm
క్రికెటర్ యువరాజ్ సింగ్‌పై గృహహింస చట్టం కింద కేసు నమోదైంది. యువరాజ్ సోదరుడు జోరావార్ సింగ్ భార్య ఆకాంక్ష శర్మ ఈ కేసు పెట్టారు. యువీతో పాటు అతడి సోదరుడు జోరావార్, తల్లి షబనమ్ సింగ్‌పై ఆమె గృహ హింస కేసు ఫైల్ చేశారు. అక్టోబర్ 21న ఈ కేసు విచారణకు రానుంది. ఆకాంక్ష శర్మ తరఫు లాయర్ స్వాతి సింగ్ మాలిక్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. యువీ తల్లి షబనమ్ కూడా ఆకాంక్షపై ఫిర్యాదు చేశారని, ఆభరణాలు వెనక్కి ఇచ్చేయాలని ఆమె కేసు వేశారని స్వాతి తెలిపారు. బిడ్డను కనాలంటూ ఆకాంక్షపై యువీ తల్లి షబనమ్ పదేపదే ఒత్తిడి చేశారని, యువీ కూడా తన తల్లికి వత్తాసు పలికాడని ఆకాంక్ష ఆరోపించారు.
Samayam Telugu yuvraj singh booked for domestic violence by bigg boss 10 contestant akanksha
యువరాజ్‌ సింగ్‌పై గృహ హింస కేసు


‘గృహ హింస అంటే.. కేవలం శారీరక హింస మాత్రమే కాదు. అది మానసిక, ఆర్థిక ఒత్తిడి కూడా.. నా క్లయింట్ ఆకాంక్ష వేదనకు గురవుతుంటే.. క్రికెటర్ యువీ ఓ మౌన ప్రేక్షకుడిగా ఉండిపోయారు’ అని లాయర్ స్వాతి అన్నారు. ఆకాంక్ష పట్ల అత్త షబనమ్ చాలా డామినెంట్‌గా వ్యవహరించినట్లు ఆమె తెలిపారు. ప్రస్తుతం ఆకాంక్ష.. బిగ్‌ బాస్‌-10లో కంటెస్టెంట్‌‌గా చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.