యాప్నగరం

యువీ ఆడలేదు..సెలక్ట్ చేయలేదు

భారత సీనియర్ ఆల్‌ రౌండర్ యువరాజ్ సింగ్‌కి ఫిటెనెస్ సమస్యలు ఉన్నాయని.. దీంతో పాటు ఈ మధ్యకాలంలో అతను

TNN 5 Dec 2017, 7:37 pm
భారత సీనియర్ ఆల్‌ రౌండర్ యువరాజ్ సింగ్‌కి ఫిటెనెస్ సమస్యలు ఉన్నాయని.. దీంతో పాటు ఈ మధ్యకాలంలో అతను తగినంత క్రికెట్ ఆడకపోవడంతోనే సెలక్షన్ నుంచి దూరంగా పెట్టినట్లు టీమిండియా చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ వెల్లడించారు. శ్రీలంకతో టీ20 సిరీస్, దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌ కోసం భారత సెలక్టర్లు జట్లని మంగళవారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇటీవల యో-యో టెస్టులో పాసైన యువరాజ్ సింగ్.. తనని కనీసం టీ20 జట్టులోకైనా తీసుకుంటారని ఆశించాడు. కానీ.. ఈ రోజు సెలక్టర్లు అతడికి మళ్లీ మొండిచేయి చూపారు. యువీని పక్కన పెట్టడంపై ఎమ్మెస్కే ప్రసాద్ జట్టు ప్రకటన అనంతరం మాట్లాడారు.
Samayam Telugu yuvraj singh has fitness issues says chairman of selectors msk prasad
యువీ ఆడలేదు..సెలక్ట్ చేయలేదు


‘యువరాజ్ సింగ్‌కి ఫిటెనెస్ సమస్యలున్నాయి. ఈ మధ్యకాలంలో అతను ఎక్కువ క్రికెట్ మ్యాచ్‌లు ఆడటం లేదు’ అని ఎమ్మెస్కే వెల్లడించారు. మ్యాచ్‌లు ఆడితేనే కదా.. ఫిటెనెస్‌తో పాటు ఫామ్‌పై ఓ అంచనాకి రాగలమనే ఉద్దేశంతో చీఫ్ సెలక్టర్లు మాట్లాడారు. తనకి 2019 వరకూ క్రికెట్ ఆడాలని ఉందని.. ఇప్పటికే కొన్ని ఫిటెనెస్ టెస్టుల్లో ఫెయిల్ అయినా.. ఈ మధ్యనే యో-యో టెస్టులో పాసైనట్లు యువరాజ్ వెల్లడించాడు. ఓటములు చూసి తాను భయపడనని.. పరాజయాలే గెలుపునకి బాటలంటూ కెరీర్‌పై యువీ తాజాగా ఓ కార్యక్రమంలో ధీమా వ్యక్తం చేశాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.