యాప్నగరం

భార్యతో కలసి డాన్స్ చేయనున్న యువరాజ్!

క్రికెటర్ యువరాజ్ సింగ్, తన సతీమణి.. హీరోయిన్ హేజిల్ కీచ్‌తో కలిసి ఓ టీవీ షోలో ఆడిపాడనున్నాడు.

TNN 21 Mar 2017, 7:53 pm
క్రికెటర్ యువరాజ్ సింగ్, తన సతీమణి.. హీరోయిన్ హేజిల్ కీచ్‌తో కలిసి ఓ టీవీ షోలో ఆడిపాడనున్నాడు. సెలబ్రిటీ రియాల్టీ షో ‘నాచ్ బలియే’ ఇందుకు వేదిక కానుంది. ముంబైలో ఇప్పుడు ఈ వార్త విస్తృతంగా ప్రచారంలో ఉంది. యువరాజ్.. రానున్న రెండు నెలల పాటు ఐపీఎల్‌తో బిజీగా ఉండనున్నాడు. ఆ తర్వాతే ఈ ఎపిసోడ్‌ను షూట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. యువరాజ్, హేజిల్ కీచ్ తమకు తప్పకుండా సహకరిస్తారని.. సదరు చానల్ పూర్తి విశ్వాసంతో ఉందట. ఇప్పటికే వారితో చర్చించినట్లు తెలుస్తోంది.
Samayam Telugu yuvraj singh hazel keech dancing their way to tv debut with nach baliye
భార్యతో కలసి డాన్స్ చేయనున్న యువరాజ్!


సెలబ్రిటీలతో డాన్స్ షోలు ప్లాన్ చేసిన ఈ ప్రత్యేక కార్యక్రమం ఏప్రిల్ నుంచి ప్రసారం కానుంది. ఈ సీజన్లో.. దివ్యాంకా త్రిపాఠి, వివేక్ దహియా; సనయా ఇరానీ, మోహిత్ సెగల్; బర్తీ సింగ్, అర్ష్ లింబాచియా; మోనాలిసా, విక్రాంత్ సింగ్ రాజ్‌పూత్ తదితర సెలబ్రిటీలతో ఈ షో ప్లాన్ చేశారు. దీనికి మంచి ఆదరణ లభిస్తుందనే గట్టి విశ్వాసంతో నిర్వాహకులు ఉన్నారు. యువీ ఏ మేరకు కిక్కివ్వగలడో తెలుసుకోవాలంటే వేచి చూడాల్సిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.