యాప్నగరం

యువరాజ్ ఓ ఫీనిక్స్ పక్షి.. మళ్లీ వస్తాడు

చితిలో దహనమైపోయినా.. మళ్లీ బూడిద నుంచి ఫీనిక్స్ పక్షి బతికొస్తుందని

TNN 11 Sep 2017, 5:36 pm
భారత్ జట్టులో చోటు కోల్పోయిన యువరాజ్ సింగ్‌ మళ్లీ ఫామ్ చాటుకుని తప్పకుండా పునరాగమనం చేస్తాడని మాజీ సెలక్టర్ సబా కరీమ్ ధీమా వ్యక్తం చేశారు. పట్టు వదలకుండా పోరాడటంలో యువరాజ్ సింగ్ ఒక ఫీనిక్స్ పక్షిలాంటోడని ఆయన ప్రశంసించాడు. చితిలో దహనమైపోయినా.. మళ్లీ బూడిద నుంచి ఫీనిక్స్ పక్షి బతికొస్తుందని గ్రీకు పురాణంలో ఓ కథగా ప్రసిద్ధి. ఇప్పుడు తనపై వస్తున్న విమర్శలకి ఆటతోనే సమాధానం చెప్పి వారి అభిప్రాయాలు తప్పు అని యువరాజ్ సింగ్ నిరూపిస్తాడనే నమ్మకం తనకుందని కరీమ్ వెల్లడించారు.
Samayam Telugu yuvraj singh is like phoenix
యువరాజ్ ఓ ఫీనిక్స్ పక్షి.. మళ్లీ వస్తాడు


‘యువరాజ్ సింగ్‌ని జట్టు నుంచి తప్పించారు. అతను మళ్లీ.. మళ్లీ తన ప్రత్యేకతని చాటుకునే ఫీనిక్స్ పక్షిలాంటోడు. అతను ఈ విమర్శల్ని ఇష్టపడతాడు. అవన్నీ తప్పుడు అభిప్రాయాలని తప్పకుండా నిరూపిస్తాడు. అవును, అతని ఆటలో కొన్ని బలహీనతలు వెలుగు చూశాయి. వాటిని సరిదిద్దుకునేందుకు అతను ప్రయత్నిస్తున్నాడు. కానీ.. ఇంతలోనే జట్టు నుంచి తప్పించేశారు. అతనో ఛాంపియన్ ఆటగాడు. ఈ విషయాన్ని యువీనే త్వరలో నిరూపిస్తాడు’ అని కరీమ్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఇటీవల శ్రీలంకతో ముగిసిన వన్డే సిరీస్‌‌కి విశ్రాంతి పేరుతో యువీని పక్కనపెట్టిన సెలక్టర్లు.. ఆదివారం ప్రకటించిన ఆస్ట్రేలియాతో తలపడే జట్టు‌కి కూడా ఎంపిక చేయకుండా మొండిచేయి చూపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.