యాప్నగరం

యువీ, హేజిల్‌తో సాగరిక సెల్ఫీ వైరల్..!

ఫేలవ ఫామ్, ఫిట్‌నెస్‌లేమి కారణంగా.. ఏడాదన్నర క్రితం భారత జట్టుకి యువరాజ్ సింగ్ దూరమవగా.. ఇప్పటికే జహీర్ ఖాన్, ఆశిష్ నెహ్రా కెరీర్‌కి వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.

Samayam Telugu 15 Oct 2018, 3:31 pm
భారత వెటరన్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్‌ ప్రస్తుతం హాలిడే ట్రిప్‌లో ఎంజాయ్ చేస్తున్నాడు. జహీర్ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా అతని భార్య సాగరిక.. మాల్దీవుల్లో పెద్ద ఎత్తున పార్టీ ఏర్పాటు చేసింది. దీనికి యువరాజ్ సింగ్ తన భార్య హేజిల్ కీచ్‌తో హాజరవగా.. ఆశిష్ నెహ్రా, అజిత్ అగార్కర్ కూడా తమ ఫ్యామిలీస్‌తో కలిసి వెళ్లారు. అక్కడ ఎంజాయ్‌మెంట్‌లో భాగంగా యువీ, హేజిల్‌తో కలిసి తాను తీసుకున్న ఓ సెల్ఫీని సాగరిక సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది ఇప్పుడు వైరెల్‌గా మారింది.
Samayam Telugu 1539591019-sasa.


ఫేలవ ఫామ్, ఫిట్‌నెస్‌లేమి కారణంగా.. ఏడాదన్నర క్రితం భారత జట్టుకి యువరాజ్ సింగ్ దూరమవగా.. ఇప్పటికే జహీర్ ఖాన్, ఆశిష్ నెహ్రా కెరీర్‌కి వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. బాలీవుడ్ సినిమాల్లో నటించిన హేజిల్ కీచ్, సాగరికలను యువీ, జహీర్ ఖాన్ ప్రేమ వివాహం చేసుకున్నారు.
View this post on Instagram #islandlife🌴 #beachbumming 🏖🚲🌊❤️🍷I A post shared by Sagarika (@sagarikaghatge) on Oct 11, 2018 at 2:48am PDT

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.