యాప్నగరం

యువీ ‘యోయో’లో పాసవ్వు చాలు..!

భారత్ జట్టులోకి పునరాగమనం చేసేందుకు భారత సీనియర్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్‌కి మరో అవకాశం. డిసెంబరు 10 నుంచి శ్రీలంకతో

TNN 10 Nov 2017, 8:23 am
భారత్ జట్టులోకి పునరాగమనం చేసేందుకు భారత సీనియర్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్‌కి మరో అవకాశం. డిసెంబరు 10 నుంచి శ్రీలంకతో పరిమిత ఓవర్ల సిరీస్ ప్రారంభంకానున్న నేపథ్యంలో ఈ నెల ఆఖరున వన్డే, టీ20ల కోసం జట్టుని సెలక్టర్లు ప్రకటించనున్నారు. అప్పటికి యోయో ఫిటెనెస్ టెస్టులో యువరాజ్ పాసైతే జట్టులో స్థానం కల్పించేందుకు తమకి ఎలాంటి అభ్యంతరం లేదని సెలక్టర్లు చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి.
Samayam Telugu yuvraj singh wants to win back no 4 slot in indian cricket team
యువీ ‘యోయో’లో పాసవ్వు చాలు..!


నాలుగు నెలల వ్యవధిలో ఇప్పటికే రెండు సార్లు యోయో టెస్టులో విఫలమైన యువీ.. మరోసారి ఈ టెస్టు కోసం నేషనల్ క్రికెట్ అకాడమీలో సిద్ధమవుతున్నాడు. భారత్ జట్టులో యువరాజ్ సింగ్ బ్యాటింగ్ స్థానం (నెం.4)లో దాదాపు ముగ్గురు యువ క్రికెటర్లని పరీక్షించినా అందరూ విఫలమయ్యారు. కేఎల్ రాహుల్, మనీశ్ పాండే, శ్రేయాస్ అయ్యర్ వరుసగా తమ అవకాశాల్ని చేజార్చుకున్నారు. దీంతో ఫిటెనెస్ టెస్టులో యువీ పాసైతే.. మళ్లీ జట్టులో పాగా వేసేందుకు ఇదే మంచి తరుణం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.