యాప్నగరం

చాహల్ జోరు.. ఆఖరి వన్డేలో ఆసీస్ 230కే ఆలౌట్

రెండో వన్డేలో శతకం సాధించిన షాన్ మార్ష్ (39: 54 బంతుల్లో 3x4)తో పాటు.. కీలకమైన ఉస్మాన్ ఖవాజా (34: 51 బంతుల్లో 2x4), స్టాయినిస్ (10: 20 బంతుల్లో 1x4) వికెట్లు పడగొట్టిన చాహల్.. ఆ జట్టుని ఏ దశలోనూ కోలుకోనివ్వలేదు.

Samayam Telugu 18 Jan 2019, 1:25 pm
ఆస్ట్రేలియా గడ్డపై తొలిసారి వన్డే ఆడిన భారత మణికట్టు స్పిన్నర్ చాహల్ అసాధారణ రీతిలో చెలరేగిపోయాడు. మెల్‌బోర్న్ వేదికగా ఈరోజు జరుగుతున్న ఆఖరి వన్డే మ్యాచ్‌లో చాహల్ (6/42) దెబ్బకి టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు 230 పరుగులకే కుప్పకూలిపోయింది. ఆ జట్టులో పీటర్ హ్యాండ్స్‌కబ్ (58: 63 బంతుల్లో 2x4) మాత్రమే అర్ధశతకంతో ఫర్వాలేదనిపించాడు. రెండో వన్డేలో శతకం సాధించిన షాన్ మార్ష్ (39: 54 బంతుల్లో 3x4)తో పాటు.. కీలకమైన ఉస్మాన్ ఖవాజా (34: 51 బంతుల్లో 2x4), స్టాయినిస్ (10: 20 బంతుల్లో 1x4) వికెట్లు పడగొట్టిన చాహల్.. ఆ జట్టుని ఏ దశలోనూ కోలుకోనివ్వలేదు. దీంతో.. ఆస్ట్రేలియా జట్టు 48.4 ఓవర్లలోనే 230 పరుగులకే చేతులెత్తేసింది. గత రెండు రెండో వన్డేల్లోనూ కుల్దీప్ యాదవ్ ఆడటంతో.. చాహల్‌కి తుది జట్టులో అవకాశం దక్కలేదు.
Samayam Telugu 2


తొలి పవర్‌ ప్లే ముగిసే సమయానికి ఓపెనర్లు అలెక్స్ కేరీ (5: 11 బంతుల్లో 1x4), అరోన్ ఫించ్ (14: 24 బంతుల్లో 1x4)‌లను భువనేశ్వర్ కుమార్ బోల్తా కొట్టించగా.. ఆ తర్వాత ఒకే ఓవర్‌లో మణికట్టు స్పిన్నర్ చాహల్ రెండు వికెట్లు పడగొట్టి ఆస్ట్రేలియాని 101/4తో కష్టాల్లోకి నెట్టాడు. ఇన్నింగ్స్ 24వ ఓవర్ వేసిన చాహల్ బౌలింగ్‌లో మొదటి బంతినే హిట్ చేసేందుకు షాన్ మార్ష్ (39: 54 బంతుల్లో 3x4) క్రీజు వెలుపలికి వచ్చాడు. కానీ.. చాహల్ తెలివిగా బంతిని వైడ్ రూపంలో లెగ్‌సైడ్ విసరగా.. దాన్ని చాకచక్యంగా అందుకున్న ధోనీ స్టంపౌట్ చేశాడు. అదే ఓవర్‌లో నాలుగో బంతిని అంచనా వేయడంలో తడబడిన ఉస్మాన్ ఖవాజా (34: 51 బంతుల్లో 2x4) చాహల్‌కే సులువైన క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆఖర్లో మాక్స్‌వెల్ (26: 19 బంతుల్లో 5x4), రిచర్డ్‌సన్ (16), ఆడమ్ జంపా (8), స్టాన్‌లేక్ (0) క్రీజులో నిలిచేందుకు విశ్వప్రయత్నం చేసినా.. చాహల్‌తో పాటు భారత్ బౌలర్లు వారిని కుదురుకోనివ్వలేదు..!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.