యాప్నగరం

ధోనీ.. చాహల్‌కి మళ్లీ చెప్పవయ్యా..!

భారత్‌, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న సిరీస్‌లో ఇద్దరు క్రికెటర్ల మధ్య ఆధిపత్య పోరు తొలి వన్డే నుంచి కొనసాగుతోంది

TNN 7 Oct 2017, 5:12 pm
భారత్‌, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న సిరీస్‌లో ఇద్దరు క్రికెటర్ల మధ్య ఆధిపత్య పోరు తొలి వన్డే నుంచి కొనసాగుతోంది. గోల్ఫ్ తరహా షాట్లతో వరుస సిక్సర్లు బాది ఓవర్ వ్యవధిలోనే బౌలర్లని బెదరగొట్టే నైజమున్న గ్లెన్‌ మాక్స్‌వెల్, భారత మణికట్టు బౌలర్ యుజ్వేందర్ చాహల్‌కి మధ్య ఆది నుంచి ఈ పోరు నడుస్తోంది. స్పిన్నర్లని టార్గెట్ చేస్తూ.. తొలి మూడు వన్డేల్లోనూ మాక్స్‌వెల్ రెచ్చిపోతే చాహల్‌తో కలిసి వ్యూహం రచించిన ధోనీ వరుసగా మూడు సార్లు అతడ్ని పెవిలియన్‌కి పంపించేశాడు. దీంతో ఇక లాభం లేదనుకుని చివరి రెండు వన్డేలకి ఆస్ట్రేలియా అతడ్ని బెంచ్‌పై కూర్చోబెట్టేసింది.
Samayam Telugu yuzvendra chahal has got glenn maxwell thrice in as many odis this series
ధోనీ.. చాహల్‌కి మళ్లీ చెప్పవయ్యా..!


వన్డేలతో పోలిస్తే టీ20ల్లో మాక్స్‌వెల్ ఇంకా ప్రమాదకర బ్యాట్స్‌మెన్. క్రీజులో ఎదుర్కొన్న తొలి బంతి నుంచే బాదుడు మొదలెట్టేస్తాడు. దీంతో.. రాంచీ వేదికగా శనివారం రాత్రి 7 గంటలకి జరగనున్న తొలి టీ20లో అతడ్ని తప్పకుండా ఆస్ట్రేలియా.. జట్టులో స్థానం కల్పిస్తుంది. ఇప్పటి మాక్స్‌వెల్ ఔట్ కోసం చాహల్‌తో కలిసి ధోనీ ఒక ప్లాన్ చేశాడు. తొలుత ఆఫ్ వికెట్‌‌కి సమీపంలో బంతులు విసురుతూ అతడ్ని రెచ్చగొట్టి.. తర్వాత క్రీజు వెలుపలికి వచ్చి షాట్ ఆడేలా చేసి.. అనంతరం ఆఫ్‌ వికెట్ దూరంగా వైడ్‌ రూపంలో బంతిని విసిరి ఔట్ చేసేలా ధోనీ వ్యూహం రచించాడు. కానీ.. ఈ బలహీనతని రెండు వన్డేలకి దూరమైన మాక్స్‌వెల్ ప్రస్తుతం అధిగమించి వస్తుంటాడు. కాబట్టి అతనిపై చాహల్‌తో కలిసి ధోనీ మళ్లీ ఏ కొత్త వ్యూహం రచించాడో తెలియాలంటే.. శనివారం రాత్రి మ్యాచ్‌లో చూడాల్సిందే..!!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.