T20 World Cup 2021 విజేత ఆస్ట్రేలియా.. ఫైనల్లో న్యూజిలాండ్ బోల్తా
ఫైనల్లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 172 పరుగులు చేయగా.. లక్ష్యాన్ని మరో 7 బంతులు మిగిలి ఉండగానే ఆస్ట్రేలియా ఛేదించేసింది. టీ20 వరల్డ్‌కప్‌ని ఆస్ట్రేలియా గెలవడం ఇదే తొలిసారి.
Samayam Telugu 14 Nov 2021, 11:40 pm
ప్రధానాంశాలు:
- టీ20 వరల్డ్‌కప్ విజేత ఆస్ట్రేలియా
- బ్యాటింగ్‌లో ఫస్ట్ చెలరేగిన న్యూజిలాండ్ కెప్టెన్
- ఛేదనలో వార్నర్, మిచెల్ మార్ష్ దూకుడు
- 7 బంతులు మిగిలి ఉండగానే ఆస్ట్రేలియా గెలుపు
టీ20 వరల్డ్‌కప్‌లో కొత్త విజేతగా ఆస్ట్రేలియా అవతరించింది. న్యూజిలాండ్‌తో దుబాయ్ వేదికగా ఆదివారం రాత్రి జరిగిన టీ20 వరల్డ్‌కప్ 2021 ఫైనల్లో 8 వికెట్ల తేడాతో గెలిచిన ఆస్ట్రేలియా.. తొలిసారి టీ20 కప్‌ని ముద్దాడింది. మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ టీమ్.. కెప్టెన్ కేన్ విలియమ్సన్ (85: 48 బంతుల్లో 10x4, 3x6) చెలరేగడంతో 4 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో మిచెల్ మార్ష్ (77 నాటౌట్: 50 బంతుల్లో 6x4, 4x6), డేవిడ్ వార్నర్ (53: 38 బంతుల్లో 4x4, 3x6) దూకుడుగా ఆడటంతో.. మరో 7 బంతులు మిగిలి ఉండగానే ఆస్ట్రేలియా 173/2తో విజయాన్ని అందుకుంది. ఆస్ట్రేలియా తొలిసారి టీ20 వరల్డ్‌కప్‌ని ముద్దాడగా.. న్యూజిలాండ్‌కి ఈ పొట్టి కప్ మరోసారి అందని ద్రాక్షగానే మిగిలిపోయింది.
173 పరుగుల ఛేదనలో ఆస్ట్రేలియా కెప్టెన్ అరోన్ ఫించ్ (5) ఆరంభంలోనే ఔటైనా.. మూడో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన మిచెల్ మార్ష్ విధ్వంసకరరీతిలో చెలరేగిపోయాడు. బౌలర్ ఎవరైనా.. బంతిని బలంగా బాదుతూ వచ్చిన మిచెల్ మార్ష్.. రెండో వికెట్‌కి డేవిడ్ వార్నర్‌తో కలిసి 92 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. మార్ష్ దూకుడుతో వార్నర్ కూడా మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లకి భారీ సిక్సర్లు కొట్టేశాడు. అయితే.. హాఫ్ సెంచరీ తర్వాత టీమ్ స్కోరు 107 వద్ద వార్నర్ ఔటవగా.. చివర్లో గ్లెన్ మాక్స్వెల్ (28 నాటౌట్: 18 బంతుల్లో 4x4, 1x6)తో కలిసి 18.5 ఓవర్లలోనే మిచెల్ మార్ష్ గెలుపు లాంఛనాన్ని పూర్తి చేశాడు. న్యూజిలాండ్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ రెండు వికెట్లు పడగొట్టాడు.
మ్యాచ్‌లో అంతకముందు టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ అరోన్ ఫించ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దాంతో.. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌ని ప్రారంభించిన ఓపెనర్లు మార్టిన్ గప్తిల్ (28: 35 బంతుల్లో 3x4), డార్లీ మిచెల్ (11: 8 బంతుల్లో 1x6) మెరుగైన ఆరంభాన్ని ఇవ్వలేకపోయారు. ఇన్నింగ్స్ 4వ ఓవర్లోనే హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో మిచెల్ ఔటైపోగా.. అనంతరం వచ్చిన కేన్ విలియమ్సన్ చాలా సేపటి వరకూ బ్యాట్ ఝళిపించే సాహసం చేయలేకపోయాడు. దాంతో 10 ఓవర్లు ముగిసే సమయానికి న్యూజిలాండ్ 57/1తో నిలిచి తక్కువ స్కోరుకే పరిమితమయ్యేలా కనిపించింది.
కానీ.. ఇన్నింగ్స్ 11వ ఓవర్ వేసిన మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో సిక్స్ కొట్టబోయిన కేన్ విలియమ్సన్.. బౌండరీ లైన్ వద్ద హేజిల్‌వుడ్‌కి క్యాచ్ ఇచ్చేశాడు. అయితే.. తత్తరపాటులో అతను ఆ క్యాచ్‌ని నేలపాలు చేయగా.. ఇక అక్కడి నుంచి విలియమ్సన్ టాప్ గేర్‌లో కొనసాగాడు. ఈ క్రమంలో స్టార్క్‌కి బ్యాక్ టు బ్యాక్ బౌండరీలు బాదిన విలియమ్సన్.. మాక్స్వెల్కి బ్యాక్ టు బ్యాక్ సిక్సర్లు కూడా కొట్టాడు. మరీ ముఖ్యంగా.. ఇన్నింగ్స్ 16వ ఓవర్లో మిచెల్ స్టార్క్‌కి విలియమ్సన్ వరుసగా 4, 4, 6, 0, 4, 4 బాదేయడంతో న్యూజిలాండ్ టీమ్‌లోనూ ఊపు వచ్చింది. అయితే.. టీమ్ స్కోరు 148 వద్ద హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో విలియమ్సన్ ఔటైపోగా.. చివర్లో నీషమ్ (13 నాటౌట్), టిమ్ సైఫర్ట్ (8 నాటౌట్) చెరొక పెద్ద షాట్ మాత్రమే ఆడగలిగారు. ఆస్ట్రేలియా బౌలర్లలో హేజిల్‌వుడ్ మూడు వికెట్లు పడగొట్టగా.. ఆడమ్ జంపాకి ఒక వికెట్ దక్కింది. విలియమ్సన్ దెబ్బకి అగ్రశ్రేణి పేసర్ మిచెల్ స్టార్క్ 4 ఓవర్లు వేసి ఏకంగా 60 పరుగులు సమర్పించుకోవడం గమనార్హం.