పసికూన స్కాట్లాండ్ తొలిసారి టీ20 వరల్డ్‌కప్‌లో ప్రధాన టోర్నీకి అర్హత సాధించింది. క్వాలిఫయింగ్ రౌండ్లో ఒమన్‌ని 8 వికెట్ల తేడాతో గురువారం రాత్రి ఓడించిన స్కాట్లాండ్.. సూపర్-12లోకి దూసుకొచ్చింది. గ్రూప్-బిలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన స్కాట్లాండ్ పాయింట్ల పట్టికలోనూ టాప్‌లో నిలవగా.. రెండు విజయాలతో బంగ్లాదేశ్ రెండో స్థానంలో నిలిచింది. గ్రూప్- బి నుంచి ఈ రెండు జట్లే సూపర్-12కి అర్హత సాధించాయి. గ్రూప్-బిలో మిగిలిన ఒమన్, పవువా న్యూ గినియా ఇంటిబాట పట్టాయి. మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఒమన్ సరిగ్గా 20 ఓవర్లలో 122 పరుగులకి ఆలౌటైంది. ఆ జట్టులో ఓపెనర్ అకిబ్ లైస్ (37: 35 బంతుల్లో 3x4, 2x6) టాప్ స్కోరర్‌గా నిలవగా.. మక్సూద్ (34: 30 బంతుల్లో 3x4, 1x6), మహ్మద్ నదీమ్ (25: 21 బంతుల్లో 2x6) విలువైన పరుగులు చేశారు. స్కాట్లాండ్ బౌలర్లలో దవేయ్ మూడు వికెట్లు పడగొట్టగా.. లెస్క్, షరీప్ రెండు, మార్క్ వాట్ ఒక వికెట్ తీశాడు.
123 పరుగుల ఛేదనలో స్కాట్లాండ్ కెప్టెన్ కైల్ కూజెర్ (41: 28 బంతుల్లో 2x4, 3x6) దూకుడుగా ఆడేయగా.. ఆ తర్వాత మాథ్యూ క్రాస్ (26: 35 బంతుల్లో), బెర్రింగ్టన్ (31: 21 బంతుల్లో 1x4, 3x6) నిలకడగా ఆడి గెలుపు లాంఛనాన్ని 17 ఓవర్లలోనే 123/2తో పూర్తి చేశారు. దాంతో.. దర్జాగా సూపర్-12కి అర్హత సాధించిన స్కాట్లాండ్.. టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో తొలిసారి ప్రధాన టోర్నీలో ఆడబోతోంది.