యాప్నగరం

ఫిఫా: ఆడుతోంది బ్రెజిల్, కోస్టారికా జట్లేనా..?

రష్యా వేదికగా జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్‌ 2018 టోర్నీ ఫుట్‌బాల్ అభిమానుల్ని ఉత్కంఠ మ్యాచ్‌లతో ఆకట్టుకుంటోంది. గత వారం ఆరంభమైన ఈ

Samayam Telugu 22 Jun 2018, 10:16 pm
రష్యా వేదికగా జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్‌ 2018 టోర్నీ ఫుట్‌బాల్ అభిమానుల్ని ఉత్కంఠ మ్యాచ్‌లతో ఆకట్టుకుంటోంది. గత వారం ఆరంభమైన ఈ టోర్నీ‌ నాకౌట్ రేసులు బుధవారం నుంచి మొదలవగా.. ఉరుగ్వే, రష్యా, ఫ్రాన్స్ జట్లు ఇప్పటికే అర్హత సాధించాయి. అయితే.. శుక్రవారం జరిగిన ఓ మ్యాచ్ అభిమానుల్ని తికమకకి గురిచేసింది. బ్రెజిల్, కోస్టారికా మధ్య ఈ మ్యాచ్ జరగగా.. ఇరు జట్ల ఆటగాళ్లు తాము మాములుగా ధరించే జెర్సీల స్థానంలో వేరొక రంగులు జెర్సీలు ధరించి ఆడారు. ఈ మ్యాచ్‌లో బ్రెజిల్ 2-0 తేడాతో అలవోకగా గెలుపొందింది.
Samayam Telugu brazil costa rica raise eyebrows by playing in away kits
ఫిఫా: ఆడుతోంది బ్రెజిల్, కోస్టారికా జట్లేనా..?


బ్రెజిల్ జట్టు సుదీర్ఘకాలంగా పసుపు రంగు జెర్సీలు ధరించి మ్యాచ్‌లు ఆడుతోంది. మరోవైపు కోస్టారికా ఎరుపు రంగు జెర్సీలతో మ్యాచ్‌లు ఆడుతోంది. కానీ.. అనూహ్యంగా ఈ రోజు రెండు జట్లూ.. తమ రంగుని మార్చుకున్నాయి. మ్యాచ్‌కి బ్రెజిల్ జట్టు నీలం రంగుతో రాగా.. కోస్టారికా ఆటగాళ్లు తెలుపు రంగు జెర్సీలు ధరించి వచ్చారు. దీనిపై ఫిఫా మీడియా ప్రతినిధి మాట్లాడుతూ ‘రెండు జట్లూ గురువారం జరిగిన సమావేశంలో పరస్పర అంగీకారంతో ఈ మేరకు జెర్సీ రంగులు మార్చుకోవాలని నిర్ణయించుకున్నాయి’ అని వెల్లడించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.