యాప్నగరం

ఫిఫాలో గోల్స్ మోత.. బెల్జియం రికార్డ్..!

ఫిఫా ప్రపంచకప్‌లో శనివారం గోల్స్ మోత మోగిపోయింది. టునీషియాతో జరిగిన మ్యాచ్‌లో బెల్జియం ఏకంగా ఐదు గోల్స్‌ కొట్టి 5-2 తేడాతో ఘన విజయాన్ని

Samayam Telugu 23 Jun 2018, 8:11 pm
ఫిఫా ప్రపంచకప్‌లో శనివారం గోల్స్ మోత మోగిపోయింది. టునీషియాతో జరిగిన మ్యాచ్‌లో బెల్జియం ఏకంగా ఐదు గోల్స్‌ కొట్టి 5-2 తేడాతో ఘన విజయాన్ని అందుకుని నాకౌట్ రేసులో నిలిచింది. పదే పదే టునీషియా గోల్‌ పోస్టుపై దాడులు చేసిన బెల్జియం.. మొత్తం 23 సార్లు గోల్‌ కోసం ప్రయత్నించింది. మరోవైపు ఎక్కువ భాగం డిఫెన్స్‌కే పరిమితమైన టునీషియా.. ఆఖర్లో ఎదురుదాడి దిగినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. తాజా ఓటమితో టునీషియా నాకౌట్ ఆశల్ని వదులుకోగా.. గ్రూప్-జిలో బెల్జియం ఆరు పాయింట్లతో అగ్రస్థానాన్ని చేజిక్కించుకుంది.
Samayam Telugu fifa world cup 2018 belgium crush tunisia 5 2
ఫిఫాలో గోల్స్ మోత.. బెల్జియం రికార్డ్..!


మ్యాచ్‌లో సగానికి పైగా బంతిని తమ నియంత్రణలోనే ఉంచుకున్న బెల్జియం ఆటగాళ్లు.. టునీషియా డిఫెన్స్‌తో ఆటాడుకున్నారు. మ్యాచ్ 6వ నిమిషంలోనే ఈడెన్ హజార్డ్ సూపర్ గోల్‌తో బెల్జియానికి 1-0తో ఆధిక్యాన్ని అందించగా.. 16న నిమిషంలో లుకాకు రైట్ కార్నర్ నుంచి బంతిని గోల్‌ పోస్టులోకి తరలించి ఆధిక్యాన్ని 2-0తో రెట్టింపు చేశాడు. ఇక్కడ నుంచి ఏ దశలోనూ మ్యాచ్‌ని గెలిచే దిశగా టునీషియా ఆడలేకపోయింది.

ప్రపంచకప్‌లోని ఓ మ్యాచ్‌లో బెల్జియం ఐదు గోల్స్ సాధించడం ఇదే తొలిసారికాగా.. గ్రూప్ దశలో వరుసగా 11వ విజయాన్ని ఆ జట్టు అందుకుంది. మరోవైపు ప్రపంచకప్‌లో టునీషియాకి ఇది వరుసగా 13వ ఓటమి. ప్రపంచకప్ చరిత్రలో ఓ జట్టు 5-2 తేడాతో గెలవడం ఇది 9వసారి మాత్రమే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.