యాప్నగరం

ఫిఫా ప్రపంచకప్‌లో మాయ చేసిన బ్రెజిల్..!

ఫిఫా ప్రపంచకప్‌ 2018లో బ్రెజిల్ మాయ చేసింది. కోస్టారికాతో శుక్రవారం జరిగిన రెండో మ్యాచ్‌లో బ్రెజిల్ 2-0 తేడాతో అలవోక విజయాన్ని

Samayam Telugu 22 Jun 2018, 8:06 pm
ఫిఫా ప్రపంచకప్‌ 2018లో బ్రెజిల్ మాయ చేసింది. కోస్టారికాతో శుక్రవారం జరిగిన రెండో మ్యాచ్‌లో బ్రెజిల్ 2-0 తేడాతో అలవోక విజయాన్ని అందుకుని నాకౌట్ అవకాశాల్ని మెరుగుపర్చుకుంది. స్విట్జర్లాండ్‌తో గత ఆదివారం జరిగిన తొలి మ్యాచ్‌ని 1-1తో డ్రాగా ముగించి నిరాశపరిచిన బ్రెజిల్.. ఈరోజు కోస్టారికాపై పూర్తి స్థాయి‌లో ఆధిపత్యం చెలాయించింది.
Samayam Telugu ..


మ్యాచ్‌లో 67 శాతం బంతిని తమ నియంత్రణలోనే ఉంచుకున్న బ్రెజిల్ ఆటగాళ్లు.. పదే పదే కోస్టారికా గోల్‌పోస్టుపై దాడులు చేశారు. ఎంతలా అంటే.. గోల్ కోసం కోస్టారికా కేవలం 4 సార్లు ప్రయత్నించగా.. బ్రెజిల్ ఏకంగా 23 సార్లు ప్రయత్నించింది. కానీ.. ఇరు జట్ల డిఫెన్స్‌ బలంగా ఉండటంతో కేటాయించిన 90 నిమిషాల్లో ఒక గోల్‌ కూడా నమోదవలేదు. అయితే.. ఆ తర్వాత ఆరు నిమిషాలు అదనపు సమయం కేటాయించగా.. తొలి నిమిషంలోనే ఫిలిప్పే కళ్లుచెదిరే గోల్‌తో బ్రెజిల్‌కి ఆధిక్యం అందించాడు. ఆ తర్వాత ఆఖరి నిమిషంలో నెయమార్ అద్భుతంగా కోస్టారికా గోల్ కీపర్‌ని బోల్తా కొట్టిస్తూ మరో గోల్ చేయడంతో.. బ్రెజిల్ గెలుపు సంబరాల్లో మునిగిపోయింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.