యాప్నగరం

అర్జెంటీనాకి చివరి ఛాన్స్.. మెస్సీ మెరిసేనా..?

ఫిఫా ప్రపంచకప్‌లో భారీ అంచనాల మధ్య అడుగుపెట్టి పేలవ ప్రదర్శనతో నిరాశపరుస్తున్న అర్జెంటీనాకి నాకౌట్ చేరేందుకు చివరి అవకాశం మిగిలి ఉంది.

Samayam Telugu 23 Jun 2018, 6:25 pm
ఫిఫా ప్రపంచకప్‌లో భారీ అంచనాల మధ్య అడుగుపెట్టి పేలవ ప్రదర్శనతో నిరాశపరుస్తున్న అర్జెంటీనాకి నాకౌట్ చేరేందుకు చివరి అవకాశం మిగిలి ఉంది. ప్రస్తుతం గ్రూప్-డిలో ఒక డ్రా, ఒక ఓటమితో నాలుగో స్థానంలో ఉన్న అర్జెంటీనా.. నాకౌట్ రేసులో నిలవాలంటే.. నైజీరియాతో మంగళవారం జరగనున్న మ్యాచ్‌లో తప్పక గెలవాల్సి ఉంది. ఆ జట్టు స్టార్ ఫుట్‌బాలర్ లియోనల్ మెస్సీ ఇప్పటి వరకు టోర్నీలో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఘోరంగా విఫలమవడంతో అర్జెంటీనా తొలి మ్యాచ్‌ని ఐస్‌లాండ్‌పై 1-1తో డ్రాగా ముగించి.. రెండో మ్యాచ్‌లో క్రొయేషియా చేతిలో 0-3 తేడాతో ఓడింది.
Samayam Telugu ..


వరుస వైఫల్యాల మధ్య శనివారం అర్జెంటీనా జట్టు తీవ్ర ఒత్తిడిలో ప్రాక్టీస్ సెషన్‌కి హాజరైంది. ముఖ్యంగా.. లియోనల్ మెస్సీకి ఇది చివరి ప్రపంచకప్‌గా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దిగ్గజ ఫుట్‌బాలర్‌కి వరల్డ్‌ కప్ గెలవాలనే చిరకాల వాంఛ తీరాంటే.. అర్జెంటీనా తర్వాత మ్యాచ్‌లో అద్భుతం చేయాల్సిందే. ఇప్పటికే స్టార్ ఆటగాళ్లు క్రిస్టియానో రొనాల్డో (పోర్చుగల్), నెయ్‌మార్ (బ్రెజిల్) కళ్లు చెదిరే గోల్స్‌తో తమ జట్లని నడిపిస్తుండగా.. మెస్సీ మాత్రం అంచనాల్ని అందుకోలేకపోతున్నాడు. చివరి మ్యాచ్‌లోనైనా.. గెలిచి మెస్సీ అభిమానుల్ని మురిపిస్తాడేమో..? చూడాలి..!!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.