యాప్నగరం

ఫిఫా ప్రపంచకప్‌లో ఈరోజు నుంచే సెమీస్

రష్యా వేదికగా జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్‌ తుది అంకానికి చేరుకుంది. భారీ అంచనాల మధ్య టోర్నీ‌లోకి అడుగుపెట్టిన అర్జెంటీనా, బ్రెజిల్, పోర్చుగల్,

Samayam Telugu 10 Jul 2018, 7:54 am
Samayam Telugu 64891012
రష్యా వేదికగా జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్‌ తుది అంకానికి చేరుకుంది. భారీ అంచనాల మధ్య టోర్నీ‌లోకి అడుగుపెట్టిన అర్జెంటీనా, బ్రెజిల్, పోర్చుగల్, జర్మనీ తదితర జట్లు ఇప్పటికే వరల్డ్‌కప్ రేసు నుంచి నిష్ర్కమించగా.. ఫ్రాన్స్, బెల్జియం, క్రొయేషియా, ఇంగ్లాండ్ మాత్రమే నిలిచాయి. ఈ నాలుగు జట్ల మధ్య మంగళవారం నుంచి సెమీఫైనల్స్‌ పోరు జరగనుంది. టోర్నీలో మొత్తం 32 జట్లు ప్రాతినిథ్యం వహించిన విషయం తెలిసిందే.

టోర్నీలో భాగంగా మంగళవారం రాత్రి 11.30 గంటలకి ఫ్రాన్స్, బెల్జియం జట్లు తొలి సెమీఫైనల్‌లో తలపడనున్నాయి. టోర్నీ ఆరంభం నుంచి అటాకింగ్, డిఫెన్స్‌తో తిరుగులేని విజయాల్ని అందుకుంటూ వచ్చిన ఈ రెండు జట్లూ ఈ మ్యాచ్‌లో గెలిచి ఫైనల్లో అడుగుపెట్టాలని ఆశిస్తున్నాయి. క్వార్టర్స్‌లో ఫ్రాన్స్‌ 2-0తో ఉరుగ్వేపై విజయం సాధించి సెమీస్‌కి చేరగా.. బెల్జియం 2-1తో బ్రెజిల్‌ను ఓడించి సెమీస్‌లోకి అడుగుపెట్టింది.

ఇప్పటి వరకు ఫ్రాన్స్‌ ఒక్కసారి మాత్రమే ప్రపంచకప్‌ గెలిచింది. కానీ.. బెల్జియం‌కి మాత్రం వరల్డ్‌కప్ ఇంకా అందని ద్రాక్షగానే మిగిలింది. అయితే.. ఇటీవల అద్భుత ఆటతీరు ప్రదర్శిస్తున్న బెల్జియం చివరిగా ఆడిన 24 మ్యాచ్‌ల్లో కనీసం ఒకదాంట్లో కూడా ఓడిపోలేదు. 19 మ్యాచ్‌ల్లో గెలిచి.. ఐదింటిని డ్రాగా ముగించింది. దీంతో.. ఈరోజు హాట్‌ ఫేవరెట్‌గా ఆ జట్టు బరిలోకి దిగుతోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.