యాప్నగరం

ఔరా ఉరుగ్వే.. చేతులెత్తేసిన రష్యా..!

ఫిఫా ప్రపంచకప్‌ 2018లో పసికూన ఉరుగ్వే సంచలన విజయాలతో దూసుకెళ్తోంది. సోమవారం రాత్రి ఆతిథ్య రష్యాతో జరిగిన మ్యాచ్‌లో ఉరుగ్వే 3-0 తేడాతో

Samayam Telugu 25 Jun 2018, 10:03 pm
ఫిఫా ప్రపంచకప్‌ 2018లో పసికూన ఉరుగ్వే సంచలన విజయాలతో దూసుకెళ్తోంది. సోమవారం రాత్రి ఆతిథ్య రష్యాతో జరిగిన మ్యాచ్‌లో ఉరుగ్వే 3-0 తేడాతో ఆ జట్టుని మట్టికరిపించింది. మ్యాచ్ ఆరంభం నుంచి ఏ దశలోనూ రష్యాకి అవకాశమివ్వని ఈ పసికూన.. తాజా విజయంతో గ్రూప్-ఎలో అగ్రస్థానాన్ని చేజిక్కించుకుని నాకౌట్‌ ముందు పూర్తి ఆత్మవిశ్వాసాన్ని కూడదీసుకుంది. మరోవైపు టోర్నీలో తొలిసారి ఓటమి రుచి చూసిన రష్యా.. గ్రూప్‌లో ఉరుగ్వే తర్వాత స్థానానికి పరిమితమైంది. ఇక గ్రూప్‌లో మిగిలిన సౌదీ అరేబియా, ఈజిప్ట్ జట్లు ఇంటిబాట పట్టనున్నాయి.
Samayam Telugu fifa world cup 2018 uruguay 3 0 russia
ఔరా ఉరుగ్వే.. చేతులెత్తేసిన రష్యా..!


మ్యాచ్‌ 10వ నిమిషంలో సువరేజ్ గోల్‌తో ఉరుగ్వేకి ఆధిక్యాన్ని అందించగా.. తర్వాత 23వ నిమిషంలో చెర్రీసేవ్, 90వ నిమిషంలో చవానీ సూపర్ గోల్స్‌తో ఆ జట్టుని గెలుపు సంబరాల్లో ముంచెత్తారు. మ్యాచ్ మొత్తం సగానికిపైగా తమ నియంత్రణలోనే బంతిని ఉంచుకున్న ఉరుగ్వే 15 సార్లు రష్యా గోల్‌పోస్టుపై దాడులు చేయగా.. రష్యా మూడు సార్లు మాత్రమే ఆ ప్రయత్నం చేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.