యాప్నగరం

ఫుట్‌బాల్ పిచ్చి: సైకిల్‌పై 4 వేల కిలోమీటర్ల ప్రయాణంతో రష్యాకు..

ఫిఫా ప్రపంచకప్ 2018 పోటీల్లో తన అభిమాన జట్టు ఆడే మ్యాచును చూసేందుకు రోడ్డు మార్గం ద్వారా 4 వేల కిలోమీటర్లు సైకిల్ తొక్కి రష్యాకు చేరుకున్నాడు.

Samayam Telugu 18 Jun 2018, 7:47 pm
ప్రపంచంలో ఎన్ని ఆటలు ఉన్నా.. ఫుట్‌బాల్ ఆటకు ఉండే ప్రత్యేకతే వేరు. తమ అభిమాన జట్లు ఆడుతున్న మ్యాచులు చూడ్డానికి తహతహలాడతుంటారు. ఇక 'ఫిఫా ప్రపంచకప్' గురించి చెప్పనక్కర్లేదు. చిన్నపెద్దా అంతా.. టీవీల ముందు వాలిపోతుంటారు. అయితే భారత్‌లో కూడా ఫుట్‌బాల్ ఆటకు వీరాభిమానులు ఉన్నారు. కేరళకు చెందిన ఓ వీరాభిమాని.. ఫిఫా ప్రపంచకప్ 2018 పోటీల్లో తన అభిమాన జట్టు ఆడే మ్యాచును చూసేందుకు సైకిల్‌పై రష్యాకు వెళ్లాడు.
Samayam Telugu Clifin Francis


కేరళలోని చేర్తలాకు చెందిన క్లిఫిన్ ఫ్రాన్సిస్(28) అనే యువకుడికి పుట్ బాల్ అంటే ప్రాణం. రష్యాలో జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్-2018 లో తన ఫేవరెట్ టీమ్ అర్జెంటీనా ఆడుతున్న మ్యాచ్ చూసేందుకు ఫిబ్రవరి 23న తన ప్రయాణం ప్రారంభించాడు. మొదట కొచ్చి నుంచి దుబాయ్‌కి విమానంలో వెళ్లాడు. దుబాయ్‌లో ఓ సైకిల్ కొనుక్కుని దుబాయ్, ఇరాన్, అజీర్బైజాన్ దేశాల మీదుగా రోడ్డు మార్గం ద్వారా 4 వేల కిలోమీటర్లు సైకిల్ తొక్కి రష్యాకు చేరుకున్నాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.