యాప్నగరం

సాకర్ ప్రపంచకప్.. ప్రైజ్‌మనీ అంతా చారిటీకే!

బ్రెజిల్ సాకర్ దిగ్గజం పీలే తర్వాత ఫుట్‌బాల్ ప్రపంచకప్ ఫైనల్లో గోల్స్ చేసిన తొలి టీనేజర్‌గా

Samayam Telugu 16 Jul 2018, 11:17 pm
బ్రెజిల్ సాకర్ దిగ్గజం పీలే తర్వాత ఫుట్‌బాల్ ప్రపంచకప్ ఫైనల్లో గోల్స్ చేసిన తొలి టీనేజర్‌గా సంచలనం రేపిన ఫ్రాన్స్ ఫుట్ బాట్ ఆటగాడు కైలియన్ ఎంబాప్పే మరో రకంగా కూడా పతాక శీర్షికలకు ఎక్కుతున్నాడిప్పుడు. ఆటతో అదరగొట్టిన ఈ ఆటగాడు ఇప్పుడు తన మనసుతో అందరినీ కట్టిపడేస్తున్నాడు. ఈ ప్రపంచకప్‌లో ఆడటం ద్వారా తను పొందిన ప్రైజ్ మనీని మొత్తం చారిటీ కార్యక్రమాలకు వినియోగిస్తానని ప్రకటించాడు ఎంబాప్పె.
Samayam Telugu mbappe


సాకర్ ప్రపంచకప్ అంటే వినోదమే కాదు, వందల కోట్ల రూపాయల వ్యాపారం కూడా. ఈ ప్రపంచకప్‌లో పాల్గొనే జట్లు అన్నింటికీ కోట్ల రూపాయలు దక్కాయి. ఆటగాళ్లకు కూడా మ్యాచ్ ఫీజు రూపంలో కోట్ల రూపాయలు లభిస్తాయని వేరే చెప్పనక్కర్లేదు. ఇలా తనకు వచ్చే సొమ్మునంతటినీ చారిటీకే ఉపయోగిస్తానని 19 యేళ్ల ఎంబాప్పె ప్రకటించాడు.

అతడికి దాదాపు మూడున్నర కోట్ల రూపాయల మొత్తం మ్యాచ్ ఫీజు రూపంలో రావొచ్చని అంచనా. ఈ సొమ్మునంతా ఈ కుర్రాడు చారిటీకి ఉపయోగిస్తానని ప్రకటించేసి తన గొప్పదనాన్ని చాటుకున్నాడు. రష్యాలో ముగిసిన సాకర్ ప్రపంచకప్‌లో బెస్ట్ యంగ్ ప్లేయర్‌గా నిలిచాడితను.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.