యాప్నగరం

ఫిఫాలో ఆ నాలుగు టీమ్స్‌ ఫేవరెట్..!

రష్యా వేదికగా గురువారం నుంచి ప్రారంభంకానున్న ఫిఫా ప్రపంచకప్ 2018లో నాలుగు జట్లు బలంగా కనిపిస్తున్నాయని భారత ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్

Samayam Telugu 13 Jun 2018, 1:12 pm
రష్యా వేదికగా గురువారం నుంచి ప్రారంభంకానున్న ఫిఫా ప్రపంచకప్ 2018లో నాలుగు జట్లు బలంగా కనిపిస్తున్నాయని భారత ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ సునీల్ ఛైత్రి వెల్లడించాడు. గత ఆదివారం ముగిసిన ఇంటర్‌కాంటినెంటల్ ఫుట్‌బాల్ టోర్నీ ఫైనల్లో అసాధారణ ఆటతీరుతో భారత జట్టుని విజేతగా నిలిపిన ఛైత్రిని.. ఫిఫాలో నాలుగు ఫేవరెట్ జట్లని ఎంపిక చేయమని కోరగా.. అతను స్పెయిన్, జర్మనీ, ఫ్రాన్స్, బ్రెజిల్ జట్లను ఎంచుకున్నాడు. కానీ.. మెస్సీని అమితంగా ఇష్టపడే ఛైత్రి.. అతను ప్రాతినిథ్యం వహించే అర్జెంటీనాని మాత్రం తన ఫేవరెట్‌ టీమ్స్‌లో ఎంచుకోకపోవడం విశేషం.
Samayam Telugu spain germany france and brazil chhetris top four world cup pick
ఫిఫాలో ఆ నాలుగు టీమ్స్‌ ఫేవరెట్..!


‘ఫిఫా ప్రపంచకప్‌ 2018లో నాలుగు ఫేవరెట్‌ టీమ్‌లను ఎంచుకోమంటే..? జర్మనీ, స్పెయిన్, బ్రెజిల్, ఫ్రాన్స్‌‌లను ఎంచుకుంటాను. ఈ జట్లు టోర్నీలో చాలా బలంగా కనిపిస్తున్నాయి. కానీ.. కొన్ని జట్లు నా ఎంపిక తప్పని నిరూపించవచ్చు. ఇంగ్లాండ్, బెల్జియం కూడా మెరుగ్గానే ఆడుతున్నాయి. నాకు వ్యక్తిగతంగా మెస్సీ అంటే చాలా ఇష్టం. నేను అతని అభిమానిని. ఫిఫాలో మెస్సీ రాణిస్తే.. అర్జెంటీనా కూడా మెరుగైన ప్రదర్శన చేయొచ్చు’ అని సునీల్ ఛైత్రి వివరించాడు. అంతర్జాతీయ ఫుట్‌బాల్ టోర్నీల్లో అత్యధిక గోల్స్ కొట్టిన రెండో ఆటగాడిగా ప్రస్తుతం లియోనల్ మెస్సీ 64 గోల్స్‌తో కొనసాగుతుండగా.. గత ఆదివారం సునీల్ ఛైత్రి 64 గోల్స్‌తో అతడ్ని సమం చేసిన విషయం తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.