యాప్నగరం

రియో: సింధు పోరాటం ఇలా సాగింది

రియో ఒలింపిక్స్ లో మహిళల బ్యాడ్మింటన్‌ సింగిల్స్ లో పీవీ సింధు రజత పతకం సాధించేందుకు ముందు అక్కడ జరిగిన ప్రతి ఆటలో తన సత్తా చాటింది.

TNN 20 Aug 2016, 7:20 am
రియో ఒలింపిక్స్ లో మహిళల బ్యాడ్మింటన్‌ సింగిల్స్ లో పీవీ సింధు రజత పతకం సాధించేందుకు ముందు అక్కడ జరిగిన ప్రతి ఆటలో తన సత్తా చాటింది. బ్యాడ్మింటన్ సింగిల్స్‌ తొలి మ్యాచ్‌ (గ్రూప్‌-ఎం)లో సింధు 21-8, 21-9తో హంగేరి ప్లేయర్ లారా సరోసినిని ఓడించింది. దీంతో ప్రీ క్వార్టర్స్ కు చేరుకుంది. ఇక ప్రీ క్వార్టర్స్‌ లో సింధు చైనాకు చెందిన తై జు యింగ్‌పై 21-13, 21-15 తేడాతో విజయం సాధించింది. దీంతో సింధు క్వార్టర్‌ ఫైనల్స్ కు అర్హత సాధించింది. క్వార్టర్‌ ఫైనల్స్ లో వరల్డ్ సెకెండ్ ర్యాంకర్ చైనా క్రీడాకారిణి వాంగ్‌ ఇహాన్‌ తో పోటీపడింది. 54 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో సింధు పక్కా ప్రణాళికతో ఆడింది. అవసరమైనపుడు స్మాష్‌లతో చెలరేగి, మరికొన్ని సార్లు సుదీర్ఘ ర్యాలీలు ఆడుతూ వాంగ్ ఇహాన్ కు చుక్కలు చూపించింది. మొత్తానికి లండన్‌ ఒలింపిక్స్‌ రజత పతక విజేత ఇహాన్‌ వాంగ్‌పై సింధు 22-20, 21-19 తేడాతో గెలుపొందింది. దీంతో ఆమె సెమీ ఫైనల్స్ లోకి ప్రవేశించింది. సెమీ ఫైనల్స్ లో జపాన్ చెందిన షట్లర్ ఒకుహారాపై 21-19, 21-10 తేడాతో గెలిచి ఫైనల్ లోకి అడుగు పెట్టింది. ఇక అందరూ అత్యంత ఉత్కంఠంతో ఎదురుచూసిన ఫైనల్స్ లో ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకర్ స్పెయిన్ ప్లేయర్ కరోలినా మారిన్ తో తలపడింది. గంటకుపైగా హోరాహోరీగా సాగిన పోరులో 21-19, 12-21, 15-21 స్కోరుతో మారిన్ చేతిలో సింధు ఓటమి చవిచూసింది. కాగా ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ లో రజతం సాధించిన తొలి భారత షట్లర్ గా సింధు రికార్డు నెలకొల్పింది.
Samayam Telugu how shuttler pvsindhu scripted history and became indias youngest individual olympic medalist
రియో: సింధు పోరాటం ఇలా సాగింది

WATCH: How shuttler @Pvsindhu1 scripted history and became India's youngest individual @Olympic medalist #RioWithTOIhttps://t.co/Ylld8XOGXg— TOI Sports News (@TOISportsNews) August 19, 2016

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.