యాప్నగరం

బాక్సింగ్ సంఘానికి ఆ మాత్రం తెలియదా?

భారత బాక్సింగ్ సంఘం చేసిన పొరపాటు ఏకంగా మన బాక్సర్లకు అనర్హత వేటు ప్రమాదాన్ని తెచ్చిపెట్టింది

Samayam Telugu 11 Aug 2016, 10:28 pm
భారత బాక్సింగ్ సంఘం చేసిన పొరపాటు ఏకంగా మన బాక్సర్లకు అనర్హత వేటు ప్రమాదాన్ని తెచ్చిపెట్టింది. ఒలింపిక్స్ లో పాల్గొనే వివిధ దేశాలకు చెందిన ఆటగాళ్లు, తమ తమ దేశాల పేర్లతో కూడిన జెర్సీలను ధరించడం అనేది ఎప్పటినుండో ఉన్న ఆనవాయితీ. ఎప్పటినుండో రియో ఒలింపిక్స్ కు భారత బాక్సింగ్ ఆటగాళ్లను సిద్ధం చేస్తున్నామని గొప్పలు చెప్పుకున్న బాక్సింగ్ సంఘం వారిని ఎలా తీర్చిదిద్దిందో వారు పతకాలు సాధించేవరకు తెలియదు. కానీ, వారిని ఒలింపిక్స్ పంపేందుకు అవసరమైన ఆనవాయితీని పాటించకుండా పోటీల్లో పాల్గొనకుండానే
Samayam Telugu indian boxers get new kits no threat of olympics disqualification
బాక్సింగ్ సంఘానికి ఆ మాత్రం తెలియదా?

అవమానకరమైన రీతిలో అనర్హత వేటుబడి బయటకు వచ్చే ప్రమాదంలోకి నెట్టింది. వారికి పంపిణీ చేసిన జెర్సీలపై భారతదేశం పేరు ముద్రించలేదు. దాంతో నిర్వాహకులు పోటీల్లో పాల్గొనేందుకు అనుమతించబోమని హెచ్చరించారు. బాక్సింగులో మనదేశం ఎన్నో ఆశలు పెట్టుకున్న క్రీడాకారులు వికాశ్ కృష్ణన్, మనోజ్ కుమార్, శివ థాపాలపై అనర్హత వేటు పడుతుందని వార్తలు కూడా వచ్చాయి. దాంతో కిందా మీదా పడుతూ బాక్సింగ్ సంఘం వాళ్లను వీళ్లను పట్టుకుని బతిమాలుకుని జెర్సీలపై ఇండియా అనే పేరును ముద్రించి హడావుడిగా వారికి పంపిణీ చేయడంతో అంతా హమ్మయ్య అని ఊపిరిపీల్చుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.