యాప్నగరం

ఒలింపిక్‌ పతకంతో తిరిగొస్తానంటున్న బాక్సర్

రియో ఒలింపిక్స్ కోసం గంటల తరబడి సాధన చేస్తున్న 24 వికాస్.. ఈ ఒలింపిక్స్ తర్వాత రిటైర్ అవుతాడట..

TNN 15 Jul 2016, 2:10 pm
లండన్ ఒలింపిక్స్‌లో తొలి దశలోనే ఇంటి ముఖం పట్టిన బాక్సర్ వికాస్ క్రిషన్ యాదవ్. ప్రస్తుతం రియో ఒలింపిక్స్ బరిలో దిగడానికి గంటల తరబడి సాధన చేస్తున్నాడు. రియో ఒలింపిక్సే తనకు చివరి ఒలింపిక్స్ అన్న వికాస్.. ఈసారి తప్పకుండా పతకంతో తిరిగి వస్తానని నమ్మకంతో చెబుతున్నాడు. పతకం సాధించడం కోసం పాటియాలాలో తీవ్రంగా సాధన చేస్తున్న అతడు ప్రాక్టీస్ కోసం సొంతంగా స్టాఫ్‌నే నియమించుకున్నాడు. 24 ఏళ్ల వయసున్న యాదవ్ ఒలింపిక్స్ తర్వాత బాక్సింగ్ నుంచి రిటైరవుతానని, కుటుంబంతో సమయం గడుపుతా నంటున్నాడు. ఈ ఒలింపిక్స్ బరిలో 28 మంది బాక్సర్లు బరిలో దిగనుండగా, వీరిలో 17 మందిని తాను ఓడించగలనని నమ్మకంగా చెబుతున్నాడు. మిగతా 10 మందిని ఓడించడమనేది ఆ రోజు ప్రదర్శన మీద ఆధారపడి ఉంటుందని చెప్పాడు. గత ఒలింపిక్స్‌కు భారత్ తరఫున 8 మంది బాక్సర్లు బరిలో దిగగా, ఈ ఏడాది తాను, శివ థాపా సహా మరో బాక్సర్ మాత్రమే బరిలో ఉండటం బాధగా ఉందన్నాడు. లండన్ ఒలింపిక్స్‌లో ప్రిలిమినరీ రౌండ్లోనే ఇంటి ముఖం పట్టాల్సి వచ్చినప్పటికీ 2014లో ఇంచియాన్‌లో జరిగిన ఆసియా క్రీడల్లో క్రిషన్ కాంస్య పతకం సాధించాడు. విజయేందర్‌లా ప్రొఫెషనల్ బాక్సర్‌గా మారలనే యోచనేది ప్రస్తుతం తనకు లేదన్నాడు. గత ఒలింపిక్స్‌లో పోటీని అంచనా వేయడంలో విఫలమయ్యానని, వాటిని అంత సీరియస్‌గా తీసుకోలేదన్న ఈ బాక్సర్ ప్రస్తుతం శ్రమిస్తోన్న తీరు చూస్తుంటే పతకంతో తిరిగి రావడం ఖాయంగా కనిపిస్తోంది.
Samayam Telugu krishan yadav will retire after olympics
ఒలింపిక్‌ పతకంతో తిరిగొస్తానంటున్న బాక్సర్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.