యాప్నగరం

టోక్యో ఒలింపిక్స్‌లో భారత డిస్కస్ త్రోయర్ కౌర్ ఫైనల్లో అడుగు

భారత డిస్కస్ త్రోయర్ కమల్‌ప్రీత్ కౌర్ 64మీ డిస్క్‌ని విసరడం ద్వారా ఫైనల్ బెర్తుని దక్కించుకుంది. కానీ.. సీమా పునియా మాత్రం 60.57మీ మాత్రమే విసరడం ద్వారా టోర్నీ నుంచి నిష్క్రమించింది.

Samayam Telugu 31 Jul 2021, 10:42 am

ప్రధానాంశాలు:

  • టోక్యో ఒలింపిక్స్ ఫైనల్‌కి చేరిన కమల్‌ప్రీత్ కౌర్
  • క్వాలిఫికేషన్‌ రౌండ్‌లో డిస్క్‌ని 64మీ విసిరిన కౌర్
  • 60.57మీ మాత్రమే డిస్క్ విసిరిన సీమా పునియా
  • టోక్యో ఒలింపిక్స్ నుంచి పునియా నిష్క్రమణ
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Kamalpreet Kaur (Pic Credit: Getty Images)
టోక్యో ఒలింపిక్స్‌లో భారత డిస్కస్ త్రోయర్ కమల్‌ప్రీత్ కౌర్ ఫైనల్లో అడుగుపెట్టింది. శనివారం క్వాలిఫికేషన్-బిలో పోటీపడిన కమల్‌ప్రీత్ కౌర్.. డిస్క్‌ని 64మీ విసరడం ద్వారా ఫైనల్ బెర్తుని ఖాయం చేసుకుంది. అమెరికాకి చెందిన అల్మాన్ మాత్రమే కౌర్ కంటే ఎక్కువ దూరం (66.42మీ) డిస్క్‌ని విసిరింది. రియో ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ సండ్ర (63.75మీ), వరల్డ్ ఛాంపియన్ యామీ (63.18) కంటే కౌర్ ఎక్కువ దూరం డిస్క్‌ని విసరడం గమనార్హం. భారత్‌కి చెందిన మరో డిస్కస్ త్రోయర్ సీమా పునియా 60.57మీ దూరం మాత్రమే డిస్క్ విసిరి 16వ స్థానంతో సరిపెట్టుకోవడం ద్వారా టోర్నీ నుంచి నిష్క్రమించింది.
క్వాలిఫికేషన్ రౌండ్‌లో మొదటి ప్రయత్నంలో 60.29మీ డిస్క్ విసిరిన కమ్‌ల్‌ప్రీత్ కౌర్.. రెండో ప్రయత్నంలో 63.97మీ విసిరింది. ఇక మూడో త్రోలో ఏకంగా 64మీ విసరడం ద్వారా కౌర్‌కి ఫెనల్ బెర్తు ఖరారైంది. క్వాలిఫికేషన్‌‌‌లో 64మీ మార్క్‌ని అందుకున్నా లేదా టాప్-12‌లో నిలిచిన వారు ఫైనల్‌కి అర్హత సాధించనున్నారు.

వాస్తవానికి కమల్‌ప్రీత్ కౌర్ బెస్ట్ 65మీ. ఈ ఏడాదిలోనే రెండు సార్లు ఆ మార్క్‌ని కౌర్‌ అందుకుంది. మరీ ముఖ్యంగా.. మార్చిలో జరిగిన ఫెడరేషన్‌ కప్‌లో 65.06మీ డిస్క్‌ని విసిరిన కమల్‌ప్రీత్ కౌర్.. నేషనల్ రికార్డ్‌ని బ్రేక్ చేసింది. అంతేకాకుండా 65మీ మార్క్‌ని అందుకున్న తొలి భారత డిస్కస్ త్రోయర్‌గానూ కౌర్ అరుదైన ఘనత సాధించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.