యాప్నగరం

రియో ఒలింపిక్స్‌లో స్వల్ప ప్రమాదం

రియో ఒలింపిక్స్ లో స్పల్ప ప్రమాదం జరిగింది. ఒలింపిక్ విలేజ్ లో ఓ చోటో భారీ కెమెరాను ఏర్పాటు చేశారు.

TNN 16 Aug 2016, 9:09 am
రియో ఒలింపిక్స్ లో స్పల్ప ప్రమాదం జరిగింది. ఒలింపిక్ విలేజ్ లో ఓ చోటో భారీ కెమెరాను ఏర్పాటు చేశారు. ఒలింపిక్ పార్క్ మొత్తాన్ని ఇది కవర్ చేస్తుంది. స్పైడర్ కెమెరాగా దీనిని వ్యవహరిస్తారు. అయితే దాని బరువును తక్కువగా అంచనా వేసి కేబుల్స్ లతో అమర్చారు. కాగా సోమవారం అది ఒక్కసారిగా ఊడి కిందపడింది. కింద నిల్చున్న ఏడుగురికి గాయాలయ్యాయి. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు పోలీసులు. సరిగ్గా బాస్కెట్ బాల్ కోర్టు బయట ఈ ఘటన జరిగింది. గాయపడిన వారిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఎవరికీ ప్రాణాపాయం లేదు. స్వల్పగాయాలై అవ్వడంతో నిర్వాహకులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ ఘటన మాత్రం వారిని కాస్త ఇబ్బందిపెట్టేదిగా మారింది. అసలే అమెరికా సూపర్ స్విమ్మర్ రియన్ లోచెట్, అతని టీమ్ లోని ముగ్గురిని రియోలో దోపిడీ దొంగలు దోచుకున్నారు. ఈ ​ సంఘటనతో ఇబ్బంది పడిన ఒలింపిక్స్ నిర్వాహకులకు కెమెరా పడిన ఘటన కాస్త మనస్తాపానికి గురిచేసింది.
Samayam Telugu overhead tv camera falls into olympic park
రియో ఒలింపిక్స్‌లో స్వల్ప ప్రమాదం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.