యాప్నగరం

ఫలించని సింధు పోరు.. చేజారిన గోల్డ్ మెడల్

పీవీ సింధు చేతికి గోల్డ్ మెడల్ వచ్చినట్టే వచ్చి చేజారిపోయింది. వరల్డ్ నెంబర్ 1 షట్లర్, స్పెయిన్ క్రీడాకారిణి మారిన్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో

Samayam Telugu 19 Aug 2016, 9:16 pm
పీవీ సింధు చేతికి గోల్డ్ మెడల్ వచ్చినట్టే వచ్చి చేజారిపోయింది. వరల్డ్ నెంబర్ 1 షట్లర్, స్పెయిన్ క్రీడాకారిణి మారిన్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో తొలి రౌండ్‌లో 21-19 పాయింట్లతో ఆధిక్యత కనబర్చిన పీవీ సింధు రెండో రౌండ్‌లో 12-21 తేడాతో వెనకబడిపోయింది. అనంతరం జరిగిన మూడో రౌండ్‌లోనూ తన పోరాట పటిమ కనబర్చిన పీవీ సింధు అంతిమంగా 15-21 పాయింట్లతో ఓటమి పాలైంది. దీంతో మరోసారి వరల్డ్ నెంబర్ 1 గా నిలిచిన మారిన్ గోల్డ్ మెడల్ కైవసం చేసుకోగా... పీవీ సింధు సిల్వర్‌తో వెనుదిరగాల్సి వచ్చింది. రియో ఒలంపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన తెలుగమ్మాయిగా చరిత్ర సృష్టిస్తుందనుకున్న పీవీ సింధు ఇలా సిల్వర్ మెడల్‌తో సరిపెట్టుకోవాల్సి రావడం నిజంగా ఒకింత బాధాకరమే. ఏదేమైనా ఆఖరి క్షణం వరకు సింధు కనబర్చిన పోరాట పటిమని మాత్రం అభినందించి తీరాల్సిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.