యాప్నగరం

రియో: గోల్ఫ్‌ లో అదితి అశోక్‌ ఓటమి

రియో ఒలింపిక్స్ లో మరో పతకం వస్తుందని చూసిన భారతీయుల ఆశలు నిరాశలయ్యాయి.

TNN 21 Aug 2016, 1:14 am
రియో ఒలింపిక్స్ లో మరో పతకం వస్తుందని చూసిన భారతీయుల ఆశలు నిరాశలయ్యాయి. గోల్ఫ్‌ లో రియోఒలింపిక్స్‌ కు అర్హత సాధించిన ఏకైక భారతీయ మహిళగా అదితి అశోక్‌ (18) రికార్డు సాధించిన విషయం తెలిసిందే. మహిళా గోల్ఫ్ ఫైనల్స్ వరకు ‌వెళ్లిన అదితి అశోక్ ప్రత్యర్థితో తన శాయశక్తుల పోరాడి ఓడింది. ఆట ముగిసేసరికి +5తో టీ41వ స్థానంలో నిలిచింది. 71 షాట్లలో పూర్తి చేయాల్సిన ఆటను అదితి 76 షాట్లతో ముగించి వెనుదిరిగింది. దీంతో మూడో పతకం ఖాయమనుకుంటున్న సమయంలో అదితిపై పెట్టుకున్నఆశలన్నీ ఆవిరయ్యాయి. ఫస్ట్ మూడు రౌండ్లలో ఆమె టాప్ టెన్ లోనే నిలిచింది. కానీ ఆ తర్వాత ఆమె వెనుకబడ్డారు. అయితే ఆడిన తీరును పలువురు ప్రముఖులు అభినందించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.