యాప్నగరం

సైనా మోకాలి శస్త్రచికిత్స పూర్తి

సైనా నెహ్వాల్ కు ముంబైలోని కోకిలా బెన్ ధీరుభాయ్ అంబానీ హాస్పిటల్ లో మోకాలి శస్త్రచికిత్స చేశారు. అయితే ఆమె మరో రెండు నెలల పాటు బాడ్మింటన్ కు దూరంగా ఉండాల్సి ఉంది.

TNN 20 Aug 2016, 11:53 pm
లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత, హైదరాబాద్ బాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ కు ముంబైలోని కోకిలా బెన్ ధీరుభాయ్ అంబానీ హాస్పిటల్ లో మోకాలి శస్త్రచికిత్స చేశారు. అయితే ఆమె మరో రెండు నెలల పాటు బాడ్మింటన్ కు దూరంగా ఉండాల్సి ఉంది. మోకాలి జాయింట్ నుంచి ఎముక పక్కకు జరగడంతో ఆమె ఆపరేషన్ చేసినట్లు డాక్టర్ దినుష్వా పర్డివాల తెలిపారు. ఈ గాయంతో బాధపడుతూ రియో ఒలింపిక్స్ లో సైనా పార్టిసిపేట్ చేయడం చాలా గొప్ప విషయం అన్నారు. ఈ సర్జరీ గాయం నుంచి ఆమె కోలుకోవాలంటే కనీసం రెండు నెలల సమయం పడుతుందన్నారు. మొదటి మూడు వారాల పాటు ఆమె పూర్తిగా రెస్ట్ తీసుకోవాలన్నారు. ఐదో వారంలో ఆమె పూర్తిగా రిహాబిలేషన్ సెంటర్ కు రావాల్సి ఉంటుందన్నారు. సైనా బాడ్మింటన్ కోర్ట్ కు వెళ్లి ప్రాక్టీస్ చేయాలంటే రెండు నెలల పైగానే సమయం పడుతుందన్నారు. ఆమె పూర్తి స్థాయిలో మ్యాచ్ ఆడాలంటే మాత్రం నాలుగు నెలల సమయం పడుతుందన్నారు. కాగా శస్త్రచికిత్స పూర్తయినట్లు తెలుపుతూ సైనా ఫొటోను పోస్ట్‌ చేశారు. దీంతో పలువురు క్రీడా, సినీ ప్రముఖులు సైనా త్వరగా కోలుకోవాలని ట్వీట్‌ చేశారు. వారందరికీ సైనా థ్యాంక్స్ తెలిపారు. అయితే సైనా నెహ్వాల్ రియో ఒలింపిక్స్‌ లో సెకండ్ గ్రూప్‌ లో ఉక్రెయిన్‌ కు చెందిన క్రీడాకారిణి మరియా ఉలితినా తో పోటీపడేసమయంలో ఆమె మోకాలి నొప్పి మరింత తీవ్రమైంది. దీంతో ఓటమి చవి చూసి రియో నుంచి బయటకు వచ్చింది.
Samayam Telugu saina nehwal can resume practice in two months surgeon
సైనా మోకాలి శస్త్రచికిత్స పూర్తి

Surgery tomorrow morning at 6 am friends pls pray for me 🙏😰😰 pic.twitter.com/xUGmbU3P3i — Saina Nehwal (@NSaina) August 19, 2016
After the surgery 😊 pic.twitter.com/wOkaVFjn3n — Saina Nehwal (@NSaina) August 20, 2016
Thank u sir 🙏🙏 https://t.co/OdXIiJI3UR — Saina Nehwal (@NSaina) August 20, 2016
Thank u sir 🙏🙏 https://t.co/nK7msdr0ut — Saina Nehwal (@NSaina) August 19, 2016
Thank u so much for the wishes and support 🙏🙏 https://t.co/SuzUq39jzC — Saina Nehwal (@NSaina) August 20, 2016
Thank u so much for the wishes and support 🙏🙏 https://t.co/YV2vv0vASc — Saina Nehwal (@NSaina) August 20, 2016
😊very nice of u sir thank u so much 🙏 https://t.co/aOe4GEUM66 — Saina Nehwal (@NSaina) August 20, 2016
Thank u my friend 🙏🙏 https://t.co/OncJczSKBG — Saina Nehwal (@NSaina) August 20, 2016

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.