యాప్నగరం

"బేటీ బచావో" అంబాసిడర్‌గా సాక్షి మాలిక్

ఒలింపిక్స్ లో కాంస్య పతకం సాధించిన సాక్షి మాలిక్ కు రూ. 2.5 కోట్ల చెక్ ను హర్యానా సీఎం అందజేశారు.

TNN 24 Aug 2016, 3:08 pm
ఒలింపిక్స్ రెజ్లింగ్ విభాగంలో కాంస్య పతకం సాధించిన సాక్షి మాలిక్ ను బేటీ బచావో అంబాసిడర్ గా నియమించారు. ఈ మేరకు హర్యానా సర్కార్ తన నిర్ణయాన్నిప్రకటించింది. పతనం సాధించిన అనంతరం తొలి సారిగా తన స్వరాష్ట్రానికి వచ్చిన ఆమెకు తన సొంతూరు రోహతక్ లో హర్యానా సీఎం ఘనంగా సన్మానించారు. ఈ సన్మాన కార్యక్రమంలో ఆమెకు రూ.2.5 కోట్ల చెక్ ను అందించారు.
Samayam Telugu sakshi malik appointed as brand ambassador of beti bachao scheme
"బేటీ బచావో" అంబాసిడర్‌గా సాక్షి మాలిక్




ఈ సందర్భంగా సాక్షి మాలిక్ పై సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ప్రశంసల వర్షం కురిపించారు. సాక్షి హర్యానాతో పాటు దేశంలోని మహిళలకు ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న బేటీ బచావో పథకానికి ఆమెను బ్రాండ్ అంబాసిడర్ గా నియమిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా సాక్షి మాలిక్ మాట్లాడుతూ ఒలింపిక్స్ పతకం సాధించేందుకు కఠోరంగా శ్రమించారని.. 12 ఏళ్ల పాటు పడిన కష్టానికి ప్రతిఫలం దక్కిందని వెల్లడించింది. తనను ఈ స్థాయిలో గౌరవించిన హర్యానా ప్రభుత్వానికి సాక్షిమాలిక్ కృతజ్ఞతలు తెలిపింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.