యాప్నగరం

రియో నుంచి రెజ్లర్ వినోద్ ఔట్!

ఆస్ట్రేలియా తరఫున ఒలింపిక్స్ పోటీలకు ఎంపికైన భారత సంతతి రెజ్లర్ వినోద్ కుమార్ డోపింగ్ టెస్టులో విఫలమయ్యాడు.

TNN 16 Jul 2016, 10:36 am
ఆస్ట్రేలియా తరఫున ఒలింపిక్స్ పోటీలకు ఎంపికైన భారత సంతతి రెజ్లర్ వినోద్ కుమార్ డోపింగ్ టెస్టులో విఫలమయ్యాడు. దీంతో నాలుగేళ్లపాటు సస్పెన్షన్‌కు గురయ్యాడు. గతేడాదే ఆస్ట్రేలియా పౌరసత్వం పొందిన ఈ హర్యానా రెజ్లర్ గ్రీకో రోమన్ విభాగంలో ఆ దేశం తరఫున ఒలింపిక్స్‌లో పాల్గొనాల్సి ఉంది. ఆసీస్ తరఫున ఇద్దరు రెజర్లు మాత్రమే ఒలింపిక్ పోటీల్లో పాల్గొనేందుకు ఎంపికవగా అందులో వినోద్ ఒకడు. అల్జీరియాలో జరిగిన ఆఫ్రికన్/ఓసియానా ఒలింపిక్ క్వాలిఫయర్ పోటీల సందర్భంగా నిర్వహించిన డోపింగ్ టెస్టులో అతడు విఫలమయ్యాడు. డోపింగ్ శాంపిళ్లు పాజిటివ్‌గా రావడంతో ఆస్ట్రేలియా అతడిపై నాలుగేళ్లపాటు వేటు వేసింది. అయితే 30 రోజుల్లోగా అతడు క్రీడా మధ్యవర్తిత్వ కోర్టుకు అపీల్ చేసుకునే అవకాశం ఉంది. ఒలింపిక్ ఆటగాళ్ల వివరాలతో ఉన్న ఆస్ట్రేలియన్ ఒలింపిక్ టీమ్ వెబ్‌సైట్ నుంచి కూడా అతడి పేరు తొలగించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.