భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ కోచ్ అవతారమెత్తింది. బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధాకపూర్‌కి బ్యాడ్మింటన్‌పై కాసేపు శిక్షణ ఇచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని పుల్లెల గోపీచంద్ అకాడమీకి మారిన సైనా నెహ్వాల్.. అక్కడికి వచ్చిన శ్రద్ధాతో ప్రాక్టీస్ చేయించింది. దీనికి సంబంధించిన వీడియోను సైనా తాజాగా అభిమానులతో సోషల్ మీడియాలో పంచుకుంది.
బ్యాడ్మింటన్‌లో ఎన్నో ఎత్తుపల్లాలు అధిగమించి భారత్‌కి చిరస్మరణీయమైన పతకాలు అందించిన సైనా నెహ్వాల్ బయోపిక్ ప్రస్తుతం ‘సైనా’గా తెరకెక్కుతోంది. ఇందులో శ్రద్ధాకపూర్.. సైనా నెహ్వాల్ పాత్రలో నటిస్తోంది. దీంతో బ్యాడ్మింటన్ కోర్టులో సైనా ఆటని దగ్గర నుంచి పరిశీలించిన శ్రద్ధాకపూర్.. ఆమె పర్యవేక్షణలోనే ప్రాక్టీస్ చేస్తోంది. తెరపై పాత్ర పండాలంటే.. చెమటోడ్చక తప్పదు కదా..!