యాప్నగరం

నేటి నుంచి ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్‌షిప్

ప్రతిష్ఠాత్మక ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్‌షిప్ బుధవారం నుంచి ప్రారంభంకాబోతోంది. గత ఏడాది కాలంగా అత్యుత్తమ

TNN 14 Mar 2018, 3:15 pm
ప్రతిష్ఠాత్మక ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్‌షిప్ బుధవారం నుంచి ప్రారంభంకాబోతోంది. గత ఏడాది కాలంగా అత్యుత్తమ ప్రదర్శనతో రాణిస్తున్న భారత షట్లర్లు పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్‌తో పాటు సీనియర్ షట్లర్ సైనా నెహ్వాల్ ఈ టోర్నీలో సత్తాచాటాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఈ టోర్నీలో ఇప్పటి వరకు పదిసార్లు పోటీపడిన సైనా నెహ్వాల్.. రెండేళ్ల క్రితం కొద్దిలో టైటిల్‌ని చేజార్చుకోగా.. ఐదు సార్లు పోటీపడిన పీవీ సింధు క్వార్టర్ ఫైనల్‌ని దాటలేకపోయింది. భారత్ తరఫున దిగ్గజ ఆటగాళ్లు ప్రకాశ్ పదుకొనె (1980) , పుల్లెల గోపీచంద్ (2001) మాత్రమే ఈ టోర్నీ నెగ్గారు.
Samayam Telugu all england championships pv sindhu faces chochuwong
నేటి నుంచి ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్‌షిప్


టోర్నీలో ఎవరితో ఎవరు పోటీపడుతున్నారంటే..?

* నాలుగో సీడ్‌గా బరిలోకి దిగుతున్న పీవీ సింధు తొలి రౌండ్‌లో థాయ్‌లాండ్‌కి చెందిన పోర్న్‌పావీ చోచువాంగ్‌ని ఢీకొట్టనుంది.
* సైనా నెహ్వాల్‌కి తొలి రౌండ్‌లోనే కఠిన ప్రత్యర్థి ఎదురుకానుంది. ఆమె డిఫెండింగ్ ఛాంపియన్ తైజు యింగ్ (చైనీస్ తైపీ)తో పోటీపడనుంది.

* కిదాంబి శ్రీకాంత్ తన తొలి రౌండ్‌లో ఫ్రాన్స్ షట్లర్ బ్రైస్ లెవర్దెజ్‌ని ఢీకొట్టనున్నాడు.

* ప్రణయ్ తన తొలి రౌండ్‌లో చౌ తీన్‌ చెన్‌ (చైనీస్‌ తైపీ)తో పోటీపడనున్నాడు.

* సాయి ప్రణీత్ తన తొలి రౌండ్‌లో కొరియాకి చెందిన షట్లర్ సాన్ వాన్‌ హోని ఢీకొట్టనున్నాడు.

డబుల్స్‌లో.. సాత్విక్- చిరాగ్ శెట్టి, సమీత్ రెడ్డి- మను అత్రి, సిక్కిరెడ్డి-అశ్విని పొన్నప్ప, మేఘన-పూర్విష.. మిక్స్‌డ్ డబుల్స్‌లో ప్రణవ్- సిక్కిరెడ్డి ఆడనున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.