యాప్నగరం

భారత్ ఖాతాలో మరో ఒకట్రెండు ఒలింపిక్ పతకాలు!

భారత ఒలింపిక్ పతకాల పట్టికలో మరో ఒకట్రెండు పతకాలు చేరనున్నాయి. ఇప్పుడు ఒలింపిక్ క్రీడలెక్కడివీ అనేగా మీ సందేహం..

TNN 29 Mar 2017, 7:45 pm
భారత ఒలింపిక్ పతకాల పట్టికలో మరో ఒకట్రెండు పతకాలు చేరనున్నాయి. ఇప్పుడు ఒలింపిక్ క్రీడలెక్కడివీ అనేగా మీ సందేహం.. వివరాల్లోకి వెళితే.. 2004లో జరిగిన ఏథేన్స్ ఒలింపిక్ క్రీడల్లో అంజూ, ఆమె భర్త బాబీ జార్జ్ సహా మరికొందరు అథ్లెట్లు భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించారు. కానీ, అప్పుడు వీళ్లెవరూ తొలి మూడు స్థానాల్లో నిలవకపోవడంతో ఎలాంటి పతకాలు దక్కలేదు. అయితే.. వీళ్లకంటే ముందు స్థానాల్లో నిలిచి పతకాలు కొట్టేసిన వారు డోపింగ్‌కు పాల్పడి ఉంటారని వీరి ప్రధాన ఆరోపణ. ఆ తర్వాత వీళ్లు ఈ విషయంపై ‘ఇంటర్నేషనల్ అసోషియేషన్ ఆఫ్ అథ్లెటిక్స్ ఫెడరేషన్స్ (IAAF), ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమీటీ(IOC)కి ఫిర్యాదు చేశారు.
Samayam Telugu anju bobby george and fellow athens 2004 contestants push for medal upgrades
భారత్ ఖాతాలో మరో ఒకట్రెండు ఒలింపిక్ పతకాలు!


నాటి నుంచి వివిధ దశల్లో విచారణ చేస్తున్న అధికారులు.. అంజూ కంటే ముందు స్థానంలో నిలిచిన రష్యాకు చెందిన అథ్లెట్లు డ్రగ్స్ తీసుకున్నది నిజమేనని నిర్ధారణకు వచ్చినట్లు కనిపిస్తోంది. ఇదే నిజమైతే.. 13 ఏళ్ల తర్వాత అంజూ ఇప్పుడు.. ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన క్రీడాకారిణిగా గుర్తింపు పొందనుంది. ఇదేవిధంగా బాబీ జార్జ్ కూడా ఓ పతకాన్ని దక్కించుకోనున్నారు. ఈ మేరకు వీళ్లకు ఒలింపిక్ సంఘం నుంచి త్వరలో ఆహ్వానం కూడా రావొచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.