యాప్నగరం

‘ట్రిఫుల్ జంప్‌’లో 48ఏళ్ల తర్వాత భారత్‌కి స్వర్ణం..!

ఇండోనేషియా వేదికగా జరుగుతున్న ఆసియా గేమ్స్‌లో భారత క్రీడాకారులు పతకాల పంట పండిస్తున్నారు. గేమ్స్‌లో 11వ రోజైన బుధవారం

Samayam Telugu 29 Aug 2018, 8:23 pm
ఇండోనేషియా వేదికగా జరుగుతున్న ఆసియా గేమ్స్‌లో భారత క్రీడాకారులు పతకాల పంట పండిస్తున్నారు. గేమ్స్‌లో 11వ రోజైన బుధవారం ‘ట్రిఫుల్ జంప్‌‌’ ఈవెంట్‌లో పోటీపడిన అర్పిందర్ సింగ్ అద్భుత ప్రదర్శనతో బంగారు పతకం సాధించాడు. 1970లో జరిగిన ఆసియా గేమ్స్‌లో మోహిందర్ సింగ్ ‘ట్రిఫుల్ జంప్‌‌’‌లో పసిడి పతకం గెలుపొందగా.. 48 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మళ్లీ ఈరోజు అర్పిందర్ సింగ్ స్వర్ణ పతకంతో భారత్‌ని మురిపించాడు. తాజా పతకంతో భారత్ పతకాల సంఖ్య 53కి చేరగా.. ఇందులో బంగారు పతకాలు 10.
Samayam Telugu DlxMOueXgAA1o5G


పురుషుల ట్రిపుల్‌ జంప్‌ ఫైనల్లో ఈరోజు పోటీపడిన అర్పిందర్.. రికార్డు స్థాయిలో 16.77 మీటర్ల‌ జంప్‌తో పసిడి పతకాన్ని చేజిక్కించుకున్నాడు. ఫైనల్లో ఒత్తిడికి గురై.. తొలి ప్రయత్నంలో విఫలమైన అర్పిందర్.. రెండో ప్రయత్నంలో 16.58తో ఫర్వాలేదనిపించాడు. ఇక ఆఖరి ప్రయత్నంలో ప్రత్యర్థులందరినీ ఒత్తిడిలోకి నెట్టేసేలా ఏకంగా 16.77 మీటర్లు జంప్ చేసి.. స్వర్ణాన్ని ఖాయం చేసుకున్నాడు. అతని తర్వాత స్థానంలో నిలిచిన రుస్లాన్ 16.62 మీటర్లతో రజతంతో సరిపెట్టుకోగా.. యమశిష్ట 16.14 మీటర్లతో కాంస్య పతకానికే పరిమితమయ్యాడు. 1970 ఆసియా గేమ్స్‌లో 16.11 మీటర్లతోనే మోహిందర్ సింగ్ బంగారు పతకం గెలుపొందడం కొసమెరుపు..!

ఆసియా గేమ్స్‌ పతకాల పట్టికలో భారత్ జట్టు ప్రస్తుతం 53 పతకాలతో 8వ స్థానంలో కొనసాగుతోంది. ఇందులో 10 స్వర్ణ పతకాలు ఉండగా.. 20 రజతం, 23 కాంస్యాలు ఉన్నాయి. మహిళల 200 మీటర్ల ఈవెంట్‌లో ద్యుతీచంద్ ఈరోజు రజత పతకం గెలుపొందిన విషయం తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.