యాప్నగరం

సానియా vs రోహన్ బోపన్న, గెలిచిందెవరు?

ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ సెమీఫైనల్ బెర్త్ కోసం సానియా మీర్జా, రోహన్ బోపన్న హోరాహోరీ పోరు జరిగింది.

TNN 25 Jan 2017, 6:32 pm
ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ సెమీఫైనల్ బెర్త్ కోసం సానియా మీర్జా, రోహన్ బోపన్న హోరాహోరీ పోరు జరిగింది. నువ్వా నేనా అన్నట్లు సాగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో సానియా, ఇవాన్ జోడి 6-4 3-6 12-10 తేడాతో బోపన్న, గాబ్రియేల డాబ్రోస్కీపై గెలుపొందారు. బోపన్న జోడి నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురుకావడంతో సూపర్ టై బ్రేకర్‌లో సానియా జంట కొంతమేర ఇబ్బందికి గురైంది. 67 నిమిషాలపాటు సాగిన పోరులో చివరకు సానియా జోడి పోరాట పటిమ ముందు బోపన్న జంట తలొగ్గింది.
Samayam Telugu australian open sania dodig pair wins quarters clash against bopanna gabriela
సానియా vs రోహన్ బోపన్న, గెలిచిందెవరు?


ఈ ఓటమితో రోహన్ ఆస్ట్రేలియన్ ఓపెన్ నుంచి నిష్క్రమించాడు. ఇప్పటికే అతడు పురుషుల డబుల్స్ రెండో రౌండ్లోనూ పరాజయం పాలయ్యాడు. మెన్స్ డబుల్స్ కోసం బోపన్న తొలిసారిగా పాబ్లో క్యూవస్‌తో జతకట్టాడు.

బార్బొరా స్ట్రికోవాతో జత కట్టిన సానియా మీర్జా మహిళ డబుల్స్ ప్రి క్వార్టర్ ఫైనల్లో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ గెలిస్తే ఆమె కెరీర్లో ఓవరాల్‌గా ఏడో గ్రాండ్‌స్లామ్ టైటిల్ చేరనుంది. క్వార్టర్ ఫైనల్లో పేస్-హింగిస్ జోడి విజయం సాధిస్తే సెమీస్‌లో సానియా జోడి వారితో తలపడనుంది.
జూనియర్ గర్ల్స్ సింగిల్స్‌లో జీల్ దేశాయ్ క్వార్టర్ ఫైనల్ చేరింది. సెర్బియాకు చెందిన ఐదో సీడ్ ఓల్గా డానిలోవిక్‌ను ఆమె ఓడించింది. 5-3 తేడాతో జీల్ ఆధిక్యంలో ఉన్న సమయంలో ఓల్గా మ్యాచ్ నుంచి వైదొలిగింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.